- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సరిహద్దులు మారొచ్చు.. సింధ్ ప్రాంతం భారత్‌లో కలవొచ్చు: రాజ్‌నాథ్ సింగ్
by Phanindra |
సరిహద్దులు మారొచ్చని, సింధ్ ప్రాంతం భారత్‌లో కలవొచ్చని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

X
దిశ, నేషనల్ బ్యూరో: ప్రస్తుతం పాకిస్తాన్‌లో ఉన్న సింధ్ ప్రాంతం భారత్‌లో కలిసే అవకాశం ఉందని, ఈ ప్రాంతం భారత నాగరిక వారసత్వంతో బాగా ముడిపడి ఉందని భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన సింధీ సమాజ్ సమ్మేళన్ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. సింధ్ ప్రాంతం మళ్లీ భారత్‌లో కలవొచ్చని, దేశ సరిహద్దులు మారొచ్చని అన్నారు. నాగరికత పరంగా చూసుకుంటే సింధ్ ఎప్పటికీ భారత్‌లో భాగంగానే ఉంటుందని, అంతర్జాతీయ సరిహద్దులు శాశ్వతం కాదని ఆయన చెప్పారు. ‘నేడు సింధ్ ప్రాంతం భారత్‌లో భాగం కాకపోవచ్చు. కానీ నాగరికత పరంగా ఈ ప్రాంతం ఎప్పటికీ భారత్‌లో భాగమే. ఇక ఆ భూమి గురించి మాట్లాడితే.. సరిహద్దులు మారతాయి కదా. ఏమో? రేపు సింధ్ ప్రాంతం తిరిగి భారత్‌లో కలవొచ్చు’ అని రాజ్‌నాథ్ సింగ్ చెప్పుకొచ్చారు.
Next Story






