- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Banu Mushtaq: కన్నడ రచయిత్రికి ప్రతిష్ఠాత్మక బుకర్ ప్రైజ్
భారతీయ రచయిత్రీ బాను ముస్తాక్(Banu Mushtaq) ప్రతిష్ఠాత్మక బుకర్ ప్రైజ్ 2025 (Booker Prize)ను కైవసం చేసుకున్నారు.

దిశ, నేషనల్ బ్యూరో: భారతీయ రచయిత్రీ బాను ముస్తాక్(Banu Mushtaq) ప్రతిష్ఠాత్మక బుకర్ ప్రైజ్ 2025 (Booker Prize)ను కైవసం చేసుకున్నారు. ‘హార్ట్ ల్యాంప్’ అనే చిన్న కథల సంకలనానికి గాను ఆమెను ఇది వరించింది. ఈ ప్రతిష్ఠాత్మక బహుమతి అందుకున్న తొలి కన్నడ రచయిత్రిగా బాను నిలిచారు. ముస్లిం కుటుంబంలో జన్మించిన బాను.. పాఠశాల విద్యను అభ్యసిస్తోన్న సమయంలోనే తొలిసారి ఒక షార్ట్ స్టోరీ రాశారు. అయితే, 26 ఏళ్ల వయసులో తన కథ పత్రికలో ప్రచురితమైంది. దాంతో ఆమె ప్రతిభ వెలుగులోకి వచ్చింది. తన తండ్రి ప్రోత్సాహంతో చదువులో రాణించిన ఆమె.. కన్నడ భాషపై పట్టు సాధించారు. తర్వాత ఆమె రిపోర్టర్‌గా, లాయర్‌గా వృత్తిజీవితాన్ని కొనసాగించారు. ఆమెకు రచయితగా మాత్రమే కాకుండా, మహిళల హక్కుల కోసం పోరాడే సామాజిక కార్యకర్తగా కూడా గుర్తింపు దక్కించుకున్నారు. మతం లేదా సమాజం మహిళలపై విధించే ఆంక్షలను, ఆపాదించే నియమాలను ఆమె కథల ద్వారా తీవ్రంగా ప్రశ్నించారు. మహిళలు ఎదుర్కొంటున్న బాధలను, వారు ఎదుర్కొంటున్న ఘర్షణలను ఆమె రచనలలో ప్రతిబింబించారు. 'హార్ట్ ల్యాంప్' కథా సంపుటితో పాటు బాను ముస్తాక్ మొత్తం ఆరు చిన్న కథల సంకలనాలు, ఒక నవల, ఇంకా పలు ఇతర రచనలు చేశారు. అంతేకాకుండా, 'దాన చింతామణి అతిమబ్బె' అనే ప్రత్యేక బహుమతిని అందుకున్నారు.
రచయిత్రీ ఏమన్నారంటే..
బాను ముస్తాక్ ఆదివారం జరిగిన ఒక షార్ట్-లిస్ట్ రీడింగ్ ఈవెంట్‌లో మాట్లాడుతూ.. ఈ కథలు మహిళలగురించి అని.. వారిపై జరిగే క్రూరత్వం గురించి అని చెప్పారు. మరోవైపు, బుకర్ ప్రైజ్ అవార్డు ద్వారా 50,000 పౌండ్ల (66 వేల డాలర్ల) డబ్బు ఆమెకు లభించనుంది. అంతేకాకుండా, ఈ డబ్బును రచయిత,అనువాదకుల మధ్య సమానంగా విభజించాలి. ప్రతి ఒక్కరికి ట్రోఫీని కూడా అందజేస్తారు. మరోవైపు, అంతర్జాతీయ బుకర్ బహుమతిని ప్రతి సంవత్సరం ప్రదానం చేస్తారు.






