- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కంబోడియాలో చిక్కుకున్న భారతీయులు: 250 మందిని రక్షించిన విదేశాంగ శాఖ
కంబోడియాలో చిక్కుకున్న 250 మంది భారతీయులకు విదేశాంగ శాఖ స్వదేశానికి తీసుకొచ్చింది. వీరిలో 75 మందిని గత మూడు నెలల్లోనే రక్షించినట్టు తెలిపింది.

దిశ, నేషనల్ బ్యూరో: కంబోడియాలో చిక్కుకున్న 250 మంది భారతీయులకు విదేశాంగ శాఖ స్వదేశానికి తీసుకొచ్చింది. వీరిలో 75 మందిని గత మూడు నెలల్లోనే రక్షించినట్టు తెలిపింది. ఈ విషయాన్ని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఆదివారం వెల్లడించారు. వీరందరిని అక్కడ ఉద్యోగాలు ఇప్పిస్తానని తీసుకెళ్లి మోసం చేశారని, ఆ తర్వాత వారితో బలవంతంగా సైబర్ మోసాలు చేయించారని తెలిపారు. దీంతో రాయబార కార్యాలయానికి ఫిర్యాదులు అందాయని ఈ నేపథ్యంలోనే ఆరాతీసి వారందరినీ ఇండియాకు తీసుకొచ్చామని చెప్పారు. సుమారు 5వేల మంది ఇంకా కంబోడియాలో చిక్కుకున్నారని తెలుస్తోంది. వారిని కూడా త్వరలోనే వెనక్కి తీసుకొస్తామని, అందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని జైస్వాల్ స్పష్టం చేశారు. కంబోడియాలోని భారత రాయబార కార్యాలయం ఇటువంటి ఫిర్యాదులపై చురుకుగా పని చేస్తుందని తెలిపారు. మోసపూరిత వ్యక్తుల పట్ల భారతీయులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.






