- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
US: ఐదేళ్లలో అమెరికాకు పెరిగిన వలసలు.. 460 శాతం పెరుగుదల..
ప్రపంచం నలుమూలల నుంచి లక్షలాదిమంది యువత అమెరికాలో స్థిరపడేందుకు ప్రయత్నిస్తారు. అక్కడో ఎలానో బతకవచ్చు.. మంచివేతనం దొరుకుతుంది.. మెరుగైన జీవతం దొరుకుతుందన్న ఆశ వారిని అగ్రరాజ్యం వలస వెళ్లేలా చేస్తోంది.

దిశ, నేషనల్ బ్యూరో: ప్రపంచం నలుమూలల నుంచి లక్షలాదిమంది యువత అమెరికాలో స్థిరపడేందుకు ప్రయత్నిస్తారు. అక్కడో ఎలానో బతకవచ్చు.. మంచివేతనం దొరుకుతుంది.. మెరుగైన జీవతం దొరుకుతుందన్న ఆశ వారిని అగ్రరాజ్యం వలస వెళ్లేలా చేస్తోంది. కుదిరితే చట్టబద్ధంగా లేదంటే అక్రమంగానైనా అమెరికా వెళ్లేందుకు సాహసిస్తున్నారు. కాగా.. గత ఐదేళ్లలో భారత్ నుంచి అమెరికా వెళ్లే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ విషయాన్ని జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయ అధ్యయనంలో తేలింది. యూఎస్ఏలో అనధికార భారతీయులు: ట్రెండ్స్ అండ్ డెవలప్‌మెంట్స్' అనే శీర్షికతో వెలువడిన ఈ నివేదికలో భారతీయుల వలసల గురించి పేర్కొంది. 2018 నుంచి 2023 వరకు ఉన్న ఐదేళ్లలో అమెరికాలో ఆశ్రయం పొందుతున్న భారతీయుల సంఖ్య 466 శాతం పెరిగిందంది. 2018లో 9,000 మంది అమెరికా రాగా.. 2023లో అది 51 వేలకు పెరిగిందని వెల్లడించింది. అంతేకాకుండా, 2016తో పోలిస్తే సరైన పత్రాలు లేకుండా యూఎస్ వచ్చే వారి సంఖ్య 60 శాతం తగ్గినట్లు అధికారిక డేటా ద్వారా తెలుస్తోందని పేర్కొంది.
వారిలో 60 శాతం తగ్గుదల
2022లోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ (DHS) డేటా ప్రకారం 2016 నుంచి సరైన పత్రాలు లేని భారతీయుల జనభా 60 శాతం తగ్గిందని అధ్యయనం పేర్కొంది. 2016కు ముందు చట్టబద్ధతలేని 5.6 లక్షల మంది భారతీయులు ఉండగా.. 2022కి అది 2.2 లక్షలకు తగ్గిందంది. DHS డేటాను బట్టి చూస్తే, ఆ సంవత్సరంలో యూఎస్‌లో మొత్తం 7 శాతం మంది జనభా ఇండియన్ ఫారెన్ బార్న్ జనాభా 7 శాతం అనధికారంగ ఉన్నారని నివేదికలో వెల్లడైంది. ఇకపోతే, కరోనా వ్యాప్తి తర్వాత భారత్ నుంచి విదేశాలకు వెళ్లే వారి సంఖ్య అధికంగా పెరిగింది.అమెరికా మాత్రమే కాకుండా, కెనడా, యూకే, ఆస్ట్రేలియా రాష్ట్రాల్లో కూడా వలసల్లో పెరుగుదల కనిపించింది.






