- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చమురు నౌకలోని ఇండియన్స్ రిలీజ్!
వెనిజులా నౌకలో అరెస్టయిన ముగ్గురు భారతీయులను అమెరికా విడుదల చేసింది.

దిశ, వెబ్ డెస్క్ : ఇటీవల రష్యా రక్షణలో ఉన్న వెనిజులా చమురు నౌకను అమెరికా స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. కాగా ఈ నౌకలో అదుపులోకి తీసుకున్న సిబ్బందిలో ముగ్గురు భారతీయులు ఉండగా.. వారిని ఈరోజు విడుదల చేసారు. రష్యా జెండా ఉన్న ఆయిల్ ట్యాంకర్ మారినెరాలో అక్రమంగా చమురును తరలిస్తున్నట్టు ఆరోపిస్తూ.. జనవరి 7న ఐస్లాండ్ సమీపంలోని నార్త్ అట్లాంటిక్ సముద్రంలో వెనిజులా నౌకను అమెరికా కోస్ట్ గార్డ్ స్వాధీనం చేసుకుంది. నౌకలో మొత్తం 28 మంది సిబ్బంది ఉండగా.. అందులో ముగ్గురు భారతీయులు ఉన్నారు. అనంతరం వీరి విషయంలో మానవీయకోణంలో నిర్ణయం తీసుకోవాలని భారత ప్రభుత్వం, రష్యా ఎంబసీలు అమెరికాను కోరాయి. దీంతో అమెరికా అధికారులు ఆ ముగ్గురు భారతీయులను సోమవారం విడుదల చేశారు. అమెరికా నిర్ణయాన్ని భారత విదేశాంగ శాఖ స్వాగతిస్తూ.. సిబ్బంది కుటుంబాలకు సమాచారం అందించినట్లు తెలిపింది.






