- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇండియాలో ChatGPT రికార్డ్.. నెల రోజుల్లోనే వందకోట్ల ఏఐ ఫొటోలు!
భారతదేశంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) క్రేజ్ సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. ఓపెన్ ఏఐ (OperiAl) సంస్థ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన లేటెస్ట్ ఫీచర్ 'ChatGPT Images 2.0' ను ఉపయోగించడంలో ప్రపంచంలోనే భారతదేశం అగ్రస్థానంలో నిలిచింది.

దిశ, వెబ్‌డెస్క్: భారతదేశంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) క్రేజ్ సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. ఓపెన్ ఏఐ (OperiAl) సంస్థ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన లేటెస్ట్ ఫీచర్ 'ChatGPT Images 2.0' ను ఉపయోగించడంలో ప్రపంచంలోనే భారతదేశం అగ్రస్థానంలో నిలిచింది. ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చిన కేవలం నెల రోజులలోపే.. భారత యూజర్లు ఏకంగా 100 కోట్లకు (1 Billion) పైగా ఏఐ చిత్రాలను సృష్టించి రికార్డు సృష్టించారు. భారతీయులు ఈ సరికొత్త ఏఐ టూల్ను విపరీతంగా ఆదరిస్తుండటంపై ఓపెన్ ఏఐ సీఈఓ సామ్ ఆల్జీమాన్ సైతం స్పందించారు. ఆయన తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతా ద్వారా "ChatGPT Images 2.0 Q India. ఇప్పటికే అక్కడ 100 కోట్లకు పైగా చిత్రాలు సృష్టించబడ్డాయి. ఇది చూడటానికి చాలా అద్భుతంగా ఉంది" అంటూ హర్షం వ్యక్తం చేశారు.
సాధారణ యూజర్లనూ ఆకట్టుకుంటున్న ట్రెండ్..
గతంలో వచ్చిన ఏఐ ఇమేజ్ టూల్స్ కేవలం డిజైనర్లు లేదా డెవలపర్లకే పరిమితం కాగా, ‘ChatGPT Images 2.0' మాత్రం సాధారణ ఇంటర్నెట్ వినియోగదారులను సైతం భారీగా ఆకర్షిస్తోంది. ప్రస్తుతం ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, డేటింగ్ యాప్లలో కనిపిస్తున్న ఎన్నో ప్రొఫైల్ పిక్చర్లు, స్టోరీలు ఈ టూల్ ద్వారా క్రియేట్ చేసినవే కావడం విశేషం.
ఎందుకీ రేంజ్ క్రేజ్?
భారతదేశంలో ఈ టూల్ ఇంతగా వైరల్ కావడానికి ప్రధాన కారణం దీని సులువైన యాక్సెస్. ‘ChatGPT Images 2.0' అత్యంత సంక్లిష్టమైన వివరాలను, అలాగే బహుభాషా (Multilingual) ప్రాంప్ట్ కమాండ్లను కూడా సులభంగా అర్ధం చేసుకుంటుంది. అంతేకాకుండా ఫొటోల లోపల అక్షరాలను (Text) కూడా చాలా స్పష్టంగా క్రియేట్ చేయగలదు. ఎటువంటి ఎడిటింగ్ స్కిల్స్ లేని వారు సైతం సోషల్ మీడియాలో పోస్ట్ చేసేలా హై-క్వాలిటీ ఫొటోలను రూపొందించుకునే సదుపాయం ఉండటంతో భారతీయులు ఈ ఏఐ టూలు బ్రహ్మరథం పడుతున్నారు.






