- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రధాని మోడీతో భారత మహిళల జట్టు సరదా ముచ్చట్లు
ఈ నెల 2న జరిగిన మహిళల వన్డే ప్రపంచ కప్ ఫైనల్ లో గెలిచిన భారత జట్టు ఛాంపియన్స్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో భారత జట్టు బుధవారం ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు.

దిశ, వెబ్ డెస్క్: ఈ నెల 2న జరిగిన మహిళల వన్డే ప్రపంచ కప్ ఫైనల్ లో గెలిచిన భారత జట్టు (Indian team) ఛాంపియన్స్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో భారత జట్టు బుధవారం ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ (Prime Minister Modi)తో భారత మహిళల జట్టు సరదా ముచ్చట్లకు సంబంధించిన పూర్తి వీడియోను ఈ రోజు ఉదయం విడుదల చేశారు. మోడీ భేటీ సందర్భంగా సరదా సన్నివేశం చోటుచేసుకుంది. గంభీరంగా సాగుతున్న చర్చ మధ్యలో టీం ఇండియా క్రికెటర్ హర్లీన్ డియోల్ (Harleen Deol) ఒక్కసారిగా హాస్యభరితమైన ప్రశ్నతో అందరినీ నవ్వుల్లో ముంచెత్తింది. “సర్, మీ స్కిన్ ఎల్లప్పుడూ గ్లో అవుతుంటుంది.. మీ స్కిన్‌కేర్ రోటీన్ ఏమిటో చెప్పగలరా?” అంటూ హర్లీన్ మోడీని సరదాగా అడగగా, అక్కడ ఉన్నవారందరూ నవ్వులు ఆపుకోలేకపోయారు. వెంటనే మరో ఆటగాడు చమత్కారంగా “సర్, ఇది దేశంలోని కోట్లాది ప్రజల ప్రేమ వల్లే” అని చెప్పి.. మరోసారి నవ్వులు రెట్టింపు చేశారు.
టీమ్ కోచ్ అమోల్ ముజుందార్ (Amol Muzumdar) కూడా ఈ సరదాలో చేరి, “సర్, ఇలాంటి శక్తివంతమైన వ్యక్తిత్వాలతో నేను రోజూ వ్యవహరించాలి. అందుకే నా జుట్టు తెల్లబడింది!” అని నవ్వుతూ చెప్పారు. ఈ సందర్భంగా ఆయన ఇంగ్లాండ్ పర్యటనలో జరిగిన ఒక సంఘటనను కూడా గుర్తు చేశారు. అప్పట్లో రాజు చార్ల్స్‌తో ఫోటో తీయడానికి 20 మందికే అనుమతి ఉండటంతో, ఆటగాళ్లు ఆ ఫోటోను వదిలి “మేము ప్రపంచకప్ గెలిచి మోదీ సర్‌తో ఫోటో తీయాలి” అని నిర్ణయించుకున్నారని చెప్పారు. ఆ మాట నిజమై, ఇప్పుడు ఆ కల సాకారమైందన్నారు. అలాగే వైస్ కెప్టెన్ స్మృతి మందాన (Vice-captain Smriti Mandhana) మాట్లాడుతూ.. ఈ విజయం కేవలం ట్రోఫీ గెలవడమే కాకుండా భారత మహిళా క్రీడలకు కొత్త దిశ చూపిందని పేర్కొన్నారు. చివర్లో మహిళా ప్లేయర్లు అందరూ సంతకాలు చేసిన భారత జెర్సీని ప్రధాని మోడీకి గిఫ్ట్ గా ఇచ్చారు. ప్రస్తుత ప్రధాని మోడీతో భారత ప్లేయర్ల సరదా ముచ్చట్లకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
వీడియో కొరకు ఇక్కడ క్లిక్ చేయండి






