- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అమెరికాలో మాజీ ప్రేయసి హత్య.. తమిళనాడులో నిందితుడు అరెస్ట్
అమెరికాలో మాజీ ప్రేయసిని హత్య చేసి స్వదేశానికి పారిపోయిన భారతీయుడిని.. తమిళనాడులో ఇంటర్‌పోల్ అరెస్ట్ చేసింది.

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికాలో మాజీ ప్రేయసిని హత్య చేసి భారత్‌కు పారిపోయిన నిందితుడు అర్జున్ శర్మను తమిళనాడులో అరెస్టు చేశారు. మేరీల్యాండ్‌లో అనలిస్ట్‌గా పనిచేస్తున్న నికితా రావు గోదిశాలను తన అపార్ట్‌మెంట్లో కత్తితో పొడిచి హత్య చేసిన అర్జున్.. శుక్రవారం నాడు ఆమె కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ రోజే అక్కడి నుంచి భారత్‌కు పారిపోయాడు. డిసెంబరు 31 నుంచి నికిత కనిపించడం లేదని అతను పోలీసులకు చెప్పాడు. అతను పారిపోయిన తర్వాత.. అర్జున్ ఇంట్లో తనిఖీలు చేసిన పోలీసులకు కత్తిపోట్లతో కన్నుమూసిన నికిత మృతదేహం కనిపించింది. దీంతో హత్య చేసులో అర్జున్‌ను నిందితుడిగా చేర్చిన పోలీసులు.. భారత్‌లో ఉన్న అతన్ని అరెస్టు చేయడానికి భారత్ సహకారం కోరారు. ఈ నేపథ్యంలో అర్జున్‌ను ట్రేస్ చేసిన పోలీసులు.. తమిళనాడులో అతను తలదాచుకున్నట్లు గుర్తించారు. దీంతో రంగంలోకి దిగిన ఇంటర్‌పోల్ పోలీసులు అతన్ని అరెస్టు చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అర్జున్‌ను అమెరికా పంపించే ప్రక్రియను ప్రారంభించినట్లు తెలుస్తోంది.






