ఐదేళ్లలో విదేశాలకు భారీగా క్యూ కట్టిన భారతీయ పర్యాటకులు

by Muthe.Rajitha |   (  Updated:2025-08-07 12:07:59  IST  )

గడిచిన ఐదేళ్ళలో భారీగా భారతీయ పర్యాటకులు విదేశాలకు క్యూ కట్టినట్టు కేంద్ర పర్యాటక శాఖ పేర్కొంది.

ఐదేళ్లలో విదేశాలకు భారీగా క్యూ కట్టిన భారతీయ పర్యాటకులు
X

దిశ, వెబ్ డెస్క్ : గడిచిన ఐదేళ్ళలో భారీగా భారతీయ పర్యాటకులు విదేశాలకు క్యూ కట్టినట్టు కేంద్ర పర్యాటక శాఖ పేర్కొంది. అదే విధంగా గడిచిన ఐదేళ్ళలో భారత్ ను సందర్శించిన విదేశీ టూరిస్టుల సంఖ్య స్వల్పంగా తగ్గింది. 2019 నుండి 2024 వరకు విదేశీ ప్రయాణాలు చేసిన భారతీయుల వివరాలు పరిశీలిస్తే.. 2019లో 2.69 కోట్లు ఉండగా అది 2022లో 2.16 కోట్లకు తగ్గింది. మరుసటి ఏడాది 2023లో 2.79 కోట్లకు స్వల్పంగా పెరగగా... 2024లో 3.09 కోట్లకు (2019తో పోలిస్తే 14.6% పెరుగుదల) చేరింది. ఈ పెరుగుదలకు కారణాలను నిపుణులు పలు రకాలుగా విశ్లేషిస్తున్నారు.

కోవిడ్-19 తర్వాత "రివెంజ్ ట్రావెల్" అనగా కోవిద్ సమయంలో రెండేళ్లు బలవంతంగా ఇల్లు కదలకుండా ఉన్న పర్యాటకులు, మహమ్మారి కాస్త తగ్గగానే మళ్ళీ పర్యటనల బాట పట్టారు. అలాగే మధ్యతరగతి కుటుంబాల ఆదాయం పెరగడం కూడా పొరుగు దేశాలు, చిన్న బడ్జెట్ పర్యటనలు సంఖ్యా భారీగా పెరగడానికి కారణం అయింది. అలాగే ఆంతర్జాతీయ విమానాల కనెక్టివిటీ పెరగడం, వీసా విధానాలు మరింత సులభతరం కావడం.. కొన్ని దేశాలు ఉచితంగానే వీసా అందించడం కూడా ఈ పెరుగుదలకు కారణంగా తెలుస్తోంది. అయితే మనదేశం నుంచి ఎక్కువగా ఢిల్లీ (24.35%), ముంబై (20.09%) నుంచి భారతీయ పర్యాటకులు ఎక్కువగా విదేశాలకు వెళ్లినట్టు కేంద్ర పర్యాటక శాఖ పేర్కొంది. ఇదిలా ఉంటె 2019 నుంచి 2024 వరకు స్వల్పంగా విదేశీ పర్యాటకులు తగ్గారు.

2019లో లక్షకు పైగా విదేశీ పర్యాటకులు భారత్ ను సందర్శించగా.. 2022లో ఆ సంఖ్య 64 వేలకు పడిపోయింది. 2023, 2024 లో భారీగా పెరిగి... 99 వేలకు చేరింది. రాజకీయ ఉద్రిక్తతలు, ప్రయాణ ప్రాధాన్యతలలో మార్పులు, ఇతర దేశాల సులభమైన వీసా నిబంధనలు, మెరుగైన కనెక్టివిటీ, తక్కువ బడ్జెట్ లో టూరిజం వంటి అంశాల వలన భారత్ కు వచ్చే విదేశీ టూరిస్టుల సంఖ్య తగ్గిందని తెలుస్తోంది. అలాగే కొన్ని ప్రాంతాల్లో మౌలిక వసతులు లేకపోవడం కూడా ఈ తగ్గుదలకు కారణంగా తెలుస్తోంది.

Next Story