అమెరికాలో భారత టూరిస్టు దొంగతనం.. భారత్‌లోని యూఎస్‌ ఎంబసీ హెచ్చరిక

by Yella Dhawani Reddy |

అమెరికాలో భారత టూరిస్టు ఓ యువతి దొంగతనానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది.

అమెరికాలో భారత టూరిస్టు దొంగతనం.. భారత్‌లోని యూఎస్‌ ఎంబసీ హెచ్చరిక
X

దిశ, వెబ్ డెస్క్: అమెరికాలో (America) భారత టూరిస్టు (Indian Tourist) అనన్య దొంగతనానికి పాల్పడి పోలీసులకు పట్టుబడిన ఘటన కలకలం రేపింది. ఇల్లినాయిస్ రాష్ట్రంలోని ప్రసిద్ధ టార్గెట్ రిటైల్ స్టోర్‌లో సుమారు 7 గంటల పాటు తిరుగుతూ అనుమానం కలిగించిన ఆమె, దాదాపు $1300 (రూ.1.11 లక్షల) విలువైన వస్తువులు దొంగిలించే ప్రయత్నంలో అరెస్టయింది. వెనుక గేట్ నుంచి బయటకు పొయ్యే ప్రయత్నంలో ఉండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ అరెస్ట్ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఈ సంఘటనపై స్పందించిన భారత్లోని యూఎస్ ఎంబసీ భారతీయులకు గట్టిగా హెచ్చరికలు జారీ చేసింది. ‘‘అమెరికాలో దాడులు, చోరీలు, దోపిడీలు వంటి నేరాలకు పాల్పడితే కేవలం న్యాయపరమైన శిక్షలే కాదు... వీసా రద్దు కూడా జరగొచ్చు. భవిష్యత్తులో అమెరికా వీసాలకు అర్హత కోల్పోయే ప్రమాదం ఉంది. శాంతిభద్రతలకు అమెరికా అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. అందుకే విదేశీయులు అక్కడి చట్టాలను ఖచ్చితంగా గౌరవించాలి’’ అని ఎంబసీ తన అధికారిక పోస్ట్‌లో హెచ్చరించింది.

విదేశాల్లో ప్రతి పౌరుడు తన ప్రవర్తనతో దేశ ప్రతిష్టను ప్రతిబింబిస్తాడన్న విషయంలో ఈ సంఘటన మరోసారి గుర్తు చేసింది. చట్టాల పట్ల గౌరవం, నైతిక ప్రవర్తన వంటి అంశాలు అంతర్జాతీయంగా ఎంత ముఖ్యమో ఈ ఘటన స్పష్టం చేసింది. అమెరికా వంటి అగ్రరాజ్యంలో చట్ట ఉల్లంఘనకు తగిన మూల్యం చెల్లించక తప్పదని అధికారులు హెచ్చరిస్తున్నారు.

Next Story