- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డాలర్ డ్రీమ్స్‌కు కళ్లెం.. ట్రంప్ విధానాలతో పక్కదారి పడుతున్న భారతీయ విద్యార్థులు!
డాలర్స్ డ్రీమ్స్‌కు కళ్లెం వేయాలని భారతీయ విద్యార్థులు డిసైడ్ అవుతున్నారు. ట్రంప్ విధానాలతో వీళ్లంతా పక్కదారి పడుతున్నారట.

దిశ, నేషనల్ బ్యూరో: విదేశీ విద్యార్థులపై యూఎస్‌లోని డొనాల్డ్ ట్రంప్ ఫోకస్ పెట్టిన నేపథ్యంలో.. డాలర్ డ్రీమ్స్‌కు భారత విద్యార్థులు కళ్లెం వేసుకుంటున్నారట. తాజాగా హార్వర్డ్ విశ్వవిద్యాలయం యాజమాన్యంపై విదేశీ విద్యార్థుల విషయంలో ఆగ్రహం వ్యక్తం చేసిన ట్రంప్.. ఇకపై యూఎస్‌కు వచ్చే విద్యార్థుల బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ మరింత సూక్ష్మంగా చేయాలని ఆదేశాలు జారీచేసినట్లు సమాచారం. ముఖ్యంగా హార్వర్డ్‌కు వచ్చే ప్రతి వ్యక్తిపై తీవ్రమైన దర్యాప్తు చేయాలని సూచించిన ట్రంప్ సర్కారు.. విద్యార్థి వీసాల కోసం దరఖాస్తు చేసిన వారి సోషల్ మీడియాను కూడా మానిటర్ చేయాలని సూచనలు చేసింది. ప్రొ-అమెరికా కంటెంట్‌ను బ్లాక్ చేసిన వారికి వీసాలు ఇవ్వకూడదనేది యూఎస్ ప్రభుత్వం భావన. ఇలా ఎప్పటికప్పుడు విదేశీ విద్యార్థుల కాళ్లకు సంకెళ్లు వేయడానికి ట్రంప్ ప్రభుత్వం చూస్తోంది. ఈ నేపథ్యంలోనే భారత్ నుంచి యూఎస్ వెళ్లే విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిందని ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీలు చెప్తున్నాయి.
గతేడాది యూఎస్‌కు 3.3 లక్షల మంది భారత విద్యార్థులు పైచదువుల కోసం వెళ్లారు. ఈసారి ఆ సంఖ్య గణనీయంగా తగ్గిందని సమాచారం. యూఎస్ వెళ్లేందుకు ఏళ్ల తరబడి డబ్బు దాచుకొని, తీరా అక్కడకు వెళ్లిన తర్వాత ట్రంప్ ప్రభుత్వం తీసుకునే తొందరపాటు నిర్ణయాలతో అన్యాయమైపోతామని విద్యార్థులు భయపడుతున్నారు. ఈ క్రమంలోనే యూకే, ఈయూ దేశాలవైపు భారతీయ విద్యార్థులు అడుగులు వేస్తున్నారట. ముఖ్యంగా స్టెమ్ (సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథమెటిక్స్) విద్యపై ఆసక్తి ఉన్న వాళ్లు జర్మనీ వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. విద్యార్థుల పట్ల ట్రంప్ ప్రభుత్వ తీరు వచ్చే ఏడాది మారితే అప్పుడే యూఎస్ వెళ్దామని కొందరు వేచిచూస్తున్నారు. మరికొందరు యూఎస్‌ను తమ ప్లాన్స్ నుంచి తొలగించి యూరప్ దేశాల్లోని ప్రముఖ యూనివర్సిటీలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఏదేమైనా ట్రంప్ ప్రభుత్వ నిర్ణయాలు భారత విద్యార్థులను ఆందోళనకు గురిచేస్తున్నాయనే విషయం మాత్రం స్పష్టం అవుతోంది.






