యూకేలో భారత యువకుడి దారుణ హత్య.. కన్నీరుమున్నీరవుతున్న పేరెంట్స్

by Naga Rani Yarlagadda |

ఉన్నత చదువుల కోసం యూకే వెళ్లిన భారత విద్యార్థి దారుణ హత్యకు గురయ్యాడు.

యూకేలో భారత యువకుడి దారుణ హత్య.. కన్నీరుమున్నీరవుతున్న పేరెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: ఉన్నత చదువుల కోసం యూకే వెళ్లిన భారత విద్యార్థి దారుణ హత్యకు గురయ్యాడు. హర్యానాకు చెందిన విజయ్ కుమార్ షియోరాన్ (30) అనే విద్యార్థిపై వోర్ స్టర్ లో నవంబర్ 25న గుర్తు తెలియని దుండగులు కత్తులతో దాడి చేశారు. వెంటనే విజయ్ ను ఆస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. కాగా.. విజయ్ హత్యకేసులో ఐదుగురు అనుమానితుల్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిపారు.

విజయ్ కుమార్ షియోరాన్ ఈ ఏడాది ప్రారంభంలో జనవరిలో హయ్యర్ స్టడీస్ కోసమై యూకే వెళ్లాడని, చదువు పూర్తి చేసుకుని మంచి ఉద్యోగంలో స్థిరపడతాడని అనుకుంటే ఇలా విగతజీవుడవుతాడని ఊహించలేదని అతని తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. గతంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ లో జాబ్ చేశాడని, చదువు కోసమే ఆ ఉద్యోగానికి రిజైన్ చేసినట్లు తెలిపారు. వీలైనంత త్వరగా తమ కుమారుడి మృతదేహాన్ని స్వదేశానికి తీసుకువచ్చేలా ఏర్పాట్లుచేయాలని విదేశాంగ మంత్రిత్వ శాఖ, హర్యానా సీఎం నయాబ్ సింగ్ సైనీలకు విజ్ఞప్తి చేశారు.

Next Story