భారత సంతతి వ్యక్తి ‘కిక్‌బ్యాక్స్’ మోసం.. టెక్ కంపెనీకి రూ.10 కోట్లకు కుచ్చుటోపీ

by Kema Shiva Kumar |   (  Updated:2026-02-19 09:11:16  IST  )

అమెరికాలోని ఓ టెక్ కంపెనీలో భారత సంతతి ఎగ్జిక్యూటివ్ సెంథిల్ కుమార్ రామమూర్తి తన స్నేహితుడిని ‘ఘోస్ట్ ఎంప్లాయ్’గా చేర్చి, భారీ జీతం ఇప్పిస్తూ సగం వాటా లంచంగా తీసుకున్న మోసం బయటపడింది.

భారత సంతతి వ్యక్తి ‘కిక్‌బ్యాక్స్’ మోసం.. టెక్ కంపెనీకి రూ.10 కోట్లకు కుచ్చుటోపీ
X

దిశ, వెబ్‌డెస్క్: అమెరికా (America)లోని ఓ టెక్ కంపెనీలో కీలక పదవిలో ఉన్న భారత సంతతి వ్యక్తి చేసిన భారీ మోసం వెలుగులోకి వచ్చింది. తన అధికారంతో స్నేహితుడిని ఉద్యోగంలో చేర్చుకుని, ఏ పనీ చేయకుండానే భారీ జీతం ఇప్పిస్తూ, అందులో సగం వాటా రూ.10 కోట్లు లంచంగా తీసుకున్నట్లుగా తేలింది. వివరాల్లోకి వెళితే.. సెంథిల్ కుమార్ రామమూర్తి (Senthil Kumar Ramamurthy) అనే భారత సంతతి వ్యక్తి ఓ ప్రముఖ యూఎస్ కంపెనీలో ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్నాడు.

అయితే, సెంథిల్ తన స్నేహితుడిని తన కంపెనీలో ఖాళీగా టెక్నికల్ రోల్‌ పోస్టులోకి తీసుకున్నాడు. అతడికి ఏడాదికి సుమారు రూ.90 లక్షల ప్యాకేజీని నిర్ణయించారు. కానీ, రామమూర్తి స్నేహితుడు కంపెనీలో అసలు ఏ పనీ చేయలేదు. కేవలం రికార్డుల్లో ఉద్యోగిగా మాత్రమే ఉన్నాడు. ప్రతి నెలా వచ్చే జీతంలో సగం మొత్తాన్ని, అంటే ఏడాదికి సుమారు రూ.45 లక్షలను సెంథిల్ కుమార్ తన సొంతానికి ‘కిక్‌బ్యాక్స్’ (Kickbacks) రూపంలో వెనక్కి తీసుకునేవాడు. ఈ క్రమంలోనే కంపెనీలో జరిగిన అంతర్గత ఆడిటింగ్, నియామక ప్రక్రియల తనిఖీలో ఈ అవకతవకలు బయటపడ్డాయి. సదరు ఉద్యోగి నుంచి ఎటువంటి పని జరిగినట్లు ఆధారాలు లేకపోవడం, పైగా అతని నియామకంలో సెంథిల్ ప్రమేయం ఉండటంతో యాజమాన్యానికి అనుమానం వచ్చి విచారణ చేపట్టింది. దీంతో భారీ మోసం బయటపడటంతో కంపెనీ సెంథిల్ కుమార్‌ను సదరు సంస్థ వెంటనే ఉద్యోగం నుంచి తొలగించింది. అతడిపై క్రిమినల్ కేసుతో పాటు కంపెనీకి జరిగిన నష్టాన్ని వసూలు చేసేందుకు యాజమాన్యం చట్టపరమైన చర్యలు చేపట్టింది.

Next Story