White House: వైట్ హౌజ్ పై దాడి కేసు.. సాయివర్షిత్ కు 8 ఏళ్ల జైలు శిక్ష

by Shamantha N |

అమెరికా (USA) ప్రెసిడెంట్ బిల్డింగ్ వైట్‌హౌస్‌ (White House)పై దాడికి యత్నించిన భారతీయుడికి ఎనిమిదేళ్ల శిక్ష పడింది.

White House: వైట్ హౌజ్ పై దాడి కేసు.. సాయివర్షిత్ కు 8 ఏళ్ల జైలు శిక్ష
X

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా (USA) ప్రెసిడెంట్ బిల్డింగ్ వైట్‌హౌస్‌ (White House)పై దాడికి యత్నించిన భారతీయుడికి ఎనిమిదేళ్ల శిక్ష పడింది. తెలుగు సంతతికి చెందిన 19 ఏళ్ల కందుల సాయి వర్షిత్(Kandula Sai Varshith) కు శిక్ష విధించినట్లు అమెరికా కోర్టు జడ్జి డాబ్నీ ఫ్రెడ్రిచ్ తెలిపారు. అయితే, 2023 మే 22న అద్దె ట్రక్కుతో వైట్ హౌస్ పై దాడికి యత్నించిన ఘటన కలకలం రేపింది. ఆ కేసులోనే శిక్ష విధించినట్లు జడ్జి పేర్కొన్నారు. నాజీ భావజాలంతో వెళ్లి డెమోక్రటిక్‌ ప్రభుత్వాన్ని కూల్చేందుకు సాయివర్షిత్ యత్నించాడని కోర్టు పేర్కొంది. “దాడి జరిగిన రోజు సాయంత్రం మిస్సోరిలోని సెయింట్‌ లూయిస్‌ నుంచి సాయి వర్షిత్‌ వాషింగ్టన్‌ డీసీకి చేరుకున్నాడు. అక్కడ ఓ ట్రక్కును అద్దెకు తీసుకొని రాత్రి 9.35 గంటల ప్రాంతంలో వైట్‌హౌస్‌ వద్దకువెళ్లి సైడ్‌వాక్‌పై వాహనాన్ని నడిపాడు. రోడ్డుపై ఉన్న వారు భయంతో పరుగులు తీశారు. ఆ తర్వాత శ్వేతసౌధం (White House) ఉత్తరభాగం వైపు భద్రత కోసం ఏర్పాటుచేసిన ట్రాఫిక్‌ బారియర్స్‌ను ఢీకొట్టాడు. వెంటనే ట్రక్కును రివర్స్‌ చేసి మరోసారి ఢీకొట్టాడు. వాహనం నుంచి కిందకుదిగి నాజీ జెండాను పట్టుకొని నినాదాలు చేశాడు” అని కోర్టుకు అధికారులు తెలిపారు.

జోబైడెన్ పై హత్యాయత్నం

అయితే, దాడి జరిగిన వెంటనే సాయి వర్షిత్ ను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అధ్యక్షుడు జో బైడెన్‌(President Joe Biden)ను హత్య చేయాలనే లక్ష్యంతో ఉద్దేశపూర్వకంగానే ఈ దాడికి యత్నించినట్లు తేల్చారు. దీనికోసం ఏకంగా ఆరునెలలపాటు ప్రణాళికలు రచించినట్లు తెలిపారు. ఈ విషయాన్ని సాయివర్షిత్ విచారణలో అంగీకరించినట్లు సీక్రెట్ సర్వీస్ ఎజెంట్ వర్గాలు మీడియాకు తెలిపాయి. దీంతో, అతడ్ని అరెస్టు చేశారు. ఇప్పుడు కోర్టు దోషిగా తేలుస్తూ శిక్ష ఖరారు చేసింది.

Next Story