- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ట్రంప్ వచ్చాక యూఎస్ నుంచి భారీగా పెరిగిన చమురు కొనుగోళ్లు..!
ట్రంప్ వచ్చాక యూఎస్ నుంచి చమురు కొనుగోళ్లు భారీగా పెరిగాయి. సహజవాయువు కొనుగోళ్లలోనూ ఇదే ట్రెండ్ కనిపిస్తోందని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి.

దిశ, నేషనల్ బ్యూరో: యూఎస్ నుంచి చమురు దిగుమతులను భారత్ భారీగా పెంచింది. ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ ఆ దేశాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ పెరుగుదల కనిపిస్తోందని గణాంకాలు చెప్తున్నాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు యూఎస్ నుంచి ముడిచమురు దిగుమతులు 51 శాతం పెరిగాయి. మరీ ముఖ్యంగా ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో యూఎస్ నుంచి ముడిచమురు దిగుమతులు ఏకంగా 114 శాతం పెరిగినట్లు సమాచారం.
ఈ ఏడాది తొలి త్రైమాసికంలో 1.73 బిలియన్ డాలర్ల విలువైన చమురు దిగుమతి చేసుకున్న భారత్.. ఆ తర్వాతి త్రైమాసికంలో 3.7 బిలియన్ డాలర్ల విలువైన చమురును కొనుగోలు చేసింది. ఈ ఏడాది జూన్‌తో పోలిస్తే జులై నెలలో యూఎస్ నుంచి చమురు కొనుగోళ్లు 23 శాతం పెరిగాయని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. గతంలో భారత చమురు కొనుగోళ్లలో యూఎస్ వాటా కేవలం 3 శాతమే ఉండేది. ఇది జులై నెలలో 8 శాతానికి పెరిగింది.
ఇక 2025-2026 ఆర్థిక సంవత్సరంలో భారత చమురు దిగుమతులు కనీసం 150 శాతం పెరుగుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. యూఎస్ నుంచి భారత్ చేసుకునే సహజ వాయువు దిగుమతుల్లో కూడా భారీగా పెరుగుదల కనిపించినట్లు తెలుస్తోంది. గతేడాది 1.41 బిలియన్ డాలర్ల విలువైన సహజ వాయువు కొనుగోలు చేసుకున్న భారత్.. 2024-2025 ఆర్థిక సంవత్సరంలో ఇది 2.46 బిలియన్ డాలర్లకు చేరింది.
ఇది ఆరంభం మాత్రమేనని, సహజ వాయువు దిగుమతుల విషయంలో త్వరలోనే యూఎస్-భారత్ మధ్య కీలకమైన కాంట్రాక్ట్ జరుగుతుందని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. ఈ ఒప్పందం జరిగితే ఈ దిగుమతులు మరింత పెరిగే అవకాశం ఉంది.






