INS Tushil : భారత నేవీ అమ్ములపొదిలోకి ‘ఐఎన్ఎస్ తుషీల్’

by Hajipasha |   (  Updated:2024-12-09 16:44:33  IST  )

దిశ, నేషనల్ బ్యూరో : రష్యా(Russia)లో తయారైన అధునాతన గైడెడ్ మిస్సైల్ ఫ్రిగేట్‌ ‘ఐఎన్ఎస్ తుషీల్’(INS Tushil) భారత నేవీ (Indian Navy) అమ్ములపొదిలోకి చేరింది.

INS Tushil : భారత నేవీ అమ్ములపొదిలోకి ‘ఐఎన్ఎస్ తుషీల్’
X

దిశ, నేషనల్ బ్యూరో : రష్యా(Russia)లో తయారైన అధునాతన గైడెడ్ మిస్సైల్ ఫ్రిగేట్‌ ‘ఐఎన్ఎస్ తుషీల్’(INS Tushil) భారత నేవీ (Indian Navy) అమ్ములపొదిలోకి చేరింది. సోమవారం రష్యాలోని కాలినిన్ గ్రాడ్‌ నగరం వేదికగా రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ ఫ్రిగేట్‌ను భారత చీఫ్ ఆఫ్ నావల్ స్టాఫ్ అడ్మిరల్ దినేశ్ కె.త్రిపాఠికి లాంఛనంగా అప్పగించారు. భారత్‌లో ముంబై కేంద్రంగా పనిచేసే భారత నౌకాదళం పశ్చిమ విభాగానికి (స్వర్డ్ ఆర్మ్ విభాగం) ఈ ఫ్రిగేట్‌ను అందిస్తారు. చైనా ఆర్మీ దూకుడుకు కళ్లెం వేసేందుకుగానూ ‘ఐఎన్ఎస్ తుషీల్’‌ను హిందూ మహాసముద్ర జలాల్లో మోహరించనున్నారు.

ఈవిధమైన నాలుగు స్టెల్త్ ఫ్రిగేట్ల నిర్మాణం కోసం రూ.21వేల కోట్లతో 2016లో రష్యాతో భారత్ ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా రెండు ‘ఐఎన్ఎస్ తుషీల్’‌‌లను రష్యాలో.. మరో రెండింటిని భారత్‌లో తయారు చేస్తారు. ఇప్పుడు ఒక ఫ్రిగేట్‌ను భారత్‌కు రష్యా అప్పగించింది. మరో దాని తయారీ ప్రక్రియ కొనసాగుతోంది. ఈసందర్భంగా రక్షణమంత్రి రాజ్‌నాథ్ మాట్లాడుతూ.. భారత్-రష్యాల మధ్యనున్న బలమైన సంబంధాలకు రక్షణ రంగ సహకారమే ప్రత్యక్ష నిదర్శనమన్నారు. రానున్న రోజుల్లోనూ ఇరుదేశాల సంబంధాలు ఇదే రీతిలో కొనసాగుతాయని స్పష్టం చేశారు.

Next Story