- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సింగపూర్ లో ఇండియాకు చెందిన వ్యక్తికి 14 వారాల జైలు శిక్ష
సింగపూర్ అభివృద్ధిలో దూసుకుపోతోంది. దానికి తగ్గట్టుగానే కఠినమైన రూల్స్ కూడా అక్కడ ఉంటాయి.

దిశ, వెబ్ డెస్క్: విదేశాలలో కఠినమైన రూల్స్ అమలు చేస్తారు. చిన్న తప్పిదం చేస్తే పెద్ద శిక్షలు ఉంటాయి. మన ఇండియాలో మనిషిని చంపినా కూడా చట్టాలు కాపాడుతాయి. కానీ పక్క దేశాల్లో మాత్రం అస్సలు ఊరుకోరు. దుబాయ్ లేదా సౌదీ ఇలాంటి ప్రాంతాల్లో అయితే చంపడమే. అదే తరహాలో సింగపూర్ లో కూడా కఠినమైన రూల్స్ అమలు చేస్తుంది అక్కడి సర్కార్. ఈ నేపథ్యంలోనే రూల్స్ బ్రేక్ చేసినందుకుగాను భారత సంతతికి చెందిన ఓ వ్యక్తికి 14 వారాల పాటు జైలు శిక్ష విధించింది సింగపూర్ ప్రభుత్వం. ఈ సంఘటన ఇప్పుడు స్థానికంగా కలకలం రేపింది.
ఇండియాకు చెందిన ఓ వ్యక్తికి 14 వారాల జైలు శిక్ష
సింగపూర్ అభివృద్ధిలో దూసుకుపోతోంది. దానికి తగ్గట్టుగానే కఠినమైన రూల్స్ కూడా అక్కడ ఉంటాయి. మతవిద్వేషాలు.. ఇతరులను దూషించడం లాంటివి చేస్తే జైలుకు పంపడం గ్యారెంటీ. అయితే మన ఇండియాకు చెందిన ఓ వ్యక్తి, ఏకంగా మత విశ్వాసాలను దెబ్బతీసేలా వ్యవహరించాడు. దానికి తోడు పోలీసులను కూడా బండ బూతులు తిట్టాడట. దీంతో 14 వారాలపాటు జైలు శిక్ష విధించింది సింగపూర్ కోర్టు.
సింగపూర్ లో ఉంటున్న 36 ఏళ్ల విఘ్నేశ్వరన్ ఇంటి వారండాలో చిన్న పిల్లలు చెత్త వేసేవారట. అల్లరి చేసేవారట. కిందటి దీపావళి సందర్భంగా ఆ పిల్లల అల్లరి వల్ల.. తన ఇంట్లో వేడుకలు చేసుకోలేకపోయాయరట విఘ్నేశ్వరన్. దీంతో వాళ్లపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఆ పొరుగింటి మత విశ్వాసాలను కించపరిచేలా పంది మాంసాన్ని వాళ్ళ వరండాలో చల్లారట. దీంతో కిందటి ఏడాది అతన్ని అరెస్టు చేసి, మెంటల్ ఆస్పత్రిలో చేర్పించారట. అయితే ఈ కేసులో తాజాగా సింగపూర్ కోర్టు విచారణ చేసి...విఘ్నేశ్వరన్ తో క్షమాపణలు చెప్పింది. అలాగే 14 వారాల జైలు శిక్ష విధించింది.






