- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నేను ఇక్కడ చచ్చేలా ఉన్నా.. సౌదీలో చిక్కుకుపోయిన భారతీయ కార్మికుడి రోదన
నేను ఇక్కడ చచ్చేలా ఉన్నా అంటూ సౌదీలో చిక్కుకుపోయిన భారతీయ కార్మికుడు రోదిస్తున్న వీడియో వైరల్ అవుతోంది.

దిశ, నేషనల్ బ్యూరో: సౌదీలో చిక్కుకున్న ఒక భారతీయుడి హృదయవిదారక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పని కోసం వస్తే.. తన పాస్‌పోర్ట్ తీసేసుకున్నారని, స్వదేశానికి వెళ్తానంటే చంపేస్తానంటున్నారని సదరు వ్యక్తి ఆ వీడియోలో తన గోడు వెళ్లబోసుకున్నాడు. సౌదీలో ఇటీవలే కఫాలా వ్యవస్థను రద్దు చేసిన నేపథ్యంలో ఈ వీడియో వైరల్ అవుతోంది. ఢిల్లీకి చెందిన కల్పన అనే లాయర్ ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. బాధితుడి పాస్‌పోర్టును అతని స్పాన్సర్ తీసేసుకున్నాడని, అతన్ని ఎలాగైనా ప్రధాని మోడీ కాపాడాలని పేర్కొన్నారు.
ఆ వీడియోలో వ్యక్తి తను అలహాబాద్‌కు (ప్రయాగ్‌రాజ్) చెందిన వాడినని చెప్పారు. ఈ విషయంపై విదేశాంగ శాఖ వెంటనే స్పందించాలని సదరు లాయర్ కోరారు. దీనిపై సౌదీలోని భారత ఎంబసీ వెంటన స్పందించింది. సదరు వీడియోలోని వ్యక్తి ఎక్కడున్నాడో కనుక్కునే ప్రయత్నం చేస్తున్నామని, సౌదీలో అతను ఎక్కడున్నాడనే వివరాలేవీ తెలియకపోవడంతో వెంటనే ఏం చెయ్యలేకపోతున్నామని భారత ఎంబసీ వివరించింది. కుదిరితే ఆ వివరాలను తమకు అందించాలని లాయర్ కల్పనను కోరింది. అలాగే ప్రయాగ్‌రాజ్ అధికారులు కూడా అతని కుటుంబాన్ని కలిసి, అతని వివరాలు తమకు అందజేయాలని సూచించింది.






