ఒకేసారి రెండు ఉద్యోగాలు.. అమెరికాలో భారతీయుడికి 15 ఏళ్ల జైలు శిక్ష

by Ajay Maddhiboyina |

అమెరికాలో రెండు ఉద్యోగాలు చేస్తూ భార‌త సంత‌తికి చెందిన వ్యక్తి పట్టుబడ్డాడు. దీంతో అతడికి 15ఏళ్ల జైలు శిక్ష విధించారు. న్యూయార్క్‌లోని లాథమ్‌కు చెందిన మోహుల్ గోస్వామి(39) న్యూయార్క్ స్టేట్ ఆఫీస్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సర్వీస్‌లో ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నాడు.

ఒకేసారి రెండు ఉద్యోగాలు.. అమెరికాలో భారతీయుడికి 15 ఏళ్ల జైలు శిక్ష
X

దిశ‌, వెబ్ డెస్క్: అమెరికాలో రెండు ఉద్యోగాలు చేస్తూ భార‌త సంత‌తికి చెందిన వ్యక్తి పట్టుబడ్డాడు. దీంతో అతడికి 15ఏళ్ల జైలు శిక్ష విధించారు. న్యూయార్క్‌లోని లాథమ్‌కు చెందిన మోహుల్ గోస్వామి(39) న్యూయార్క్ స్టేట్ ఆఫీస్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సర్వీస్‌లో ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నాడు. అయితే రాష్ట్ర ప్రభుత్వం నుండి జీతం తీసుకుంటున్న అతడు మాల్టా పట్టణంలో మరో కాంట్రాక్ట్ ఉద్యోగం చేస్తున్నట్టు అధికారుల దృష్టికి వ‌చ్చింది.

దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా విచార‌ణ చేప‌ట్టి మోహుల్ గోస్వామిని అదుపులోకి తీసుకున్నారు. గోస్వామి నిర్లక్ష్యం కార‌ణంగా ప్ర‌భుత్యానికి సంబంధించిన రూ.44 ల‌క్ష‌లు దొంగ‌లించబ‌డ‌టంతో అధికారులు ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. కోర్టులో ప్రవేశపెట్టగా అతడికి 15 ఏళ్ల జైలు శిక్ష విధించింది. డ్యూయ‌ల్ ఎంప్లాయ్ మెంట్ రూల్ ప్ర‌కారం అమెరికాలో రెండు ఉద్యోగాలు చేయ‌డం నేరం అని కోర్టు స్పష్టం చేసింది. ప్ర‌భుత్వ ఉద్యోగం చేస్తూ మ‌రో ఉద్యోగం చేయ‌డం ప్ర‌జ‌ల‌ను మోసం చేయ‌డ‌మే అని, ప్ర‌జా వ‌న‌రుల దుర్వినియోగం అని పేర్కొంది.

Next Story