- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Canada: కెనడాలో భారతీయుడిని కత్తితో పొడిచి దారుణ హత్య
గత కొన్ని రోజులుగా కెనడాలో (Canada) భారతీయులపై, హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతుండటం తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్: గత కొన్ని రోజులుగా కెనడాలో (Canada) భారతీయులపై, హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతుండటం తెలిసిందే. తాజాగా మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఒట్టవా సమీపంలోని రాక్‌లాండ్ ప్రాంతంలో ఓ భారతీయుడిని దుండగులు కత్తితో పొడిచి చంపేశారు. ఈ విషయాన్ని కెనడాలో ఇండియన్ ఎంబసీ ఎక్స్‌లో వెల్లడించింది.
ఒట్టావాలో భారతీయుడు కత్తి పోట్లకు గురై ప్రాణాలు కోల్పోయిన ఘటన విచారకరం అని భారత ఎంబసీ తెలిపింది. ఈ ఘటనలో అనుమానితుడిని ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నారని చెప్పింది. మృతుడి కుటుంబసభ్యులకు అన్ని విధాల అండగా ఉంటామని పేర్కొంది. అయితే, మృతుడి వివరాలను వెల్లడించలేదు. భారత కాలమానం ప్రకారం శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. మృతికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని, దీనిపై దర్యాప్తు చేపట్టామని స్థానిక పోలీసులు వెల్లడించారు.






