- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భారీ వరదలు.. శ్రీలంక విమానాశ్రయంలో భారత హైకమిషన్ 'ఎమర్జెన్సీ హెల్ప్ డెస్క్' ఏర్పాటు
తుఫాను కారణంగా శ్రీలంకలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అక్కడ ఆకస్మిక వరదలు సంబవించి బీభత్సం సృష్టిస్తున్నాయి.

దిశ, వెబ్ డెస్క్: తుఫాను కారణంగా శ్రీలంకలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అక్కడ ఆకస్మిక వరదలు (Flash floods) సంబవించి బీభత్సం సృష్టిస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా వాగులు, నదులు పొంగిపొర్లుతున్నాయి. దేశవ్యాప్తంగా భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడటంతో 56 మంది మృతి చెందినట్టు ప్రభుత్వ విపత్తు నిర్వహణ కేంద్రం ప్రకటించింది. వదరల కారణంగా పలు ప్రాంతాల్లో ఇల్లు, వంతెనలు కొట్టుకుపోయాయి. దీంతో జనజీవనం అస్తవ్యస్తం అయింది. వరదల కారణంగా వేలాది మంది భారతీయులు, పర్యాటకులు అక్కడే చిక్కుకొని పోయారు. దీంతో.. శ్రీలంకలోని భారత పౌరులకు సహాయం అందించేందుకు భారత హైకమిషన్ (High Commission of India in Sri Lanka) కీలక చర్యలు చేపట్టింది.
కొలంబోలోని బండారునాయకే అంతర్జాతీయ విమానాశ్రయం (BIA) వద్ద ప్రత్యేకంగా 'ఎమర్జెన్సీ హెల్ప్ డెస్క్'ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. శ్రీలంకలోని విమానాశ్రయాల్లో లేదా దేశంలోని ఏ ప్రాంతంలోనైనా ఇబ్బందుల్లో ఉన్న భారత పౌరులు సహాయం కోసం ఈ ఎమర్జెన్సీ నంబర్+94 773727832 (ఈ నంబర్ వాట్సాప్‌కు కూడా అందుబాటులో ఉంది) ను సంప్రదించవచ్చని ప్రకటించింది. ప్రస్తుతం BIA విమానాశ్రయంలో చిక్కుకున్న భారతీయ ప్రయాణికులకు అవసరమైన అన్ని సహాయాలను, ముఖ్యంగా ఆహారం, నీటిని అందిస్తున్నట్లు భారత హైకమిషన్ తమ ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియజేసింది. విపత్కర పరిస్థితుల నేపథ్యంలో భారత పౌరుల భద్రతకు, సహాయానికి హైకమిషన్ కట్టుబడి ఉందని ప్రకటించింది.






