పహల్గామ్‌ ఘటనకు వాళ్ళే బాధ్యులు... జ్యోతి మల్హోత్రా షాకింగ్ వీడియో

by velandi.Saikiran |   (  Updated:2025-05-19 11:34:53  IST  )

పాకిస్తాన్ గూఢచారి జ్యోతి మల్హోత్రా ( jyoti malhotra).. బాగోతాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. ట్రావెల్ లాగర్ గా గుర్తి

పహల్గామ్‌ ఘటనకు వాళ్ళే బాధ్యులు... జ్యోతి మల్హోత్రా షాకింగ్ వీడియో
X

దిశ, వెబ్ డెస్క్: పాకిస్తాన్ గూఢచారి జ్యోతి మల్హోత్రా ( jyoti malhotra).. బాగోతాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. ట్రావెల్ లాగర్ గా గుర్తింపు పొందిన జ్యోతి మల్హోత్రా... ఇండియాకు సంబంధించిన రహస్యాలను.. పాకిస్తాన్ కు చేరవేసింది. పహల్గాం సంఘటన వెనుక కూడా ఈమె పాత్ర ఉందని... తాజాగా పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ గూఢచారి జ్యోతి మల్హోత్రాను తాజాగా హర్యానా పోలీసులు అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలోనే ఆమెను విచారించి.. చాలా విషయాలను రాబడుతున్నారు.

అయితే ఇలాంటి తరుణంలోనే జ్యోతి మల్హోత్రాకు సంబంధించిన షాకింగ్ వీడియో బయటకు వచ్చింది. పహల్గాం ( Phalgam ) సంఘటన జరిగిన మరుసటిరోజే... ఓ షాకింగ్ వీడియో పెట్టింది జ్యోతి మల్హోత్రా. ఇందులో భారత ప్రభుత్వాన్ని విమర్శిస్తూ రెచ్చిపోయింది. పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిది తరహాలోనే ఇండియన్ ప్రభుత్వాన్ని విమర్శించింది. పహాల్గాం సంఘటన జరగడానికి... భారత ప్రభుత్వం కారణమంటూ మండిపడింది. భద్రత సిబ్బంది అలర్ట్ గా లేకపోవడంతో... ఈ సంఘటన జరిగినట్లు.. వీడియో ద్వారా తెలిపింది జ్యోతి మల్హోత్రా. అయితే తాజాగా ఆ వీడియో బయటకు వచ్చింది.

Next Story