- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అమెరికాలో భారత యువతి దారుణ హత్య
అమెరికాలోని కొలంబియా ప్రాంతంలో నికిత గొడిశాల అనే భారత యువతి దారుణ హత్యకు గురైంది.

దిశ, వెబ్ డెస్క్ : అమెరికాలోని మేరీలాండ్ రాష్ట్రం కొలంబియా ప్రాంతంలో నికిత గొడిశాల అనే 27 ఏళ్ల భారత యువతి దారుణ హత్యకు గురైంది. నికితను మాజీ ప్రియుడు అర్జున్ శర్మనే ఆమెను హత్య చేసినట్టు పోలీసులు గుర్తించారు. న్యూ ఇయర్ వేడుకల తర్వాత నుంచి నికిత కనిపించడం లేదని ఆమె మాజీ లవర్ అర్జున్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చివరిసారిగా డిసెంబరు 31న ఎల్లికాట్ సిటీలోని తన అపార్టుమెంటులో నికితను చూసినట్లు అతడు చెప్పాడు. అయితే జనవరి 2న అతడు భారత్‌కు వెళ్లిపోయిన విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు సెర్చ్ వారెంట్‌తో అతని అపార్టుమెంటును తనిఖీ చేయగా నికిత మృతదేహం బయటపడింది.
ఆమె శరీరంపై గాయాలు ఉండటంతో హత్య జరిగినట్లు నిర్ధారణ అయ్యింది. పోస్టుమార్టం నివేదికలో డిసెంబరు 31నే నికిత హత్యకు గురైనట్టు వైద్యులు తేల్చారు. అయితే హత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. భారత్‌కు పారిపోయిన అర్జున్‌ను పట్టుకునేందుకు ఫెడరల్ అధికారుల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. మరోవైపు నికిత ఆచూకీ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న ఆమె స్నేహితులు... ఆమె హత్యకు గురైన విషయం బయటపడటంతో షాక్ కు గురయ్యారు.






