Indian Fishermens : పాక్‌ జైలు నుంచి 22 మంది భారత జాలర్లు విడుదల

by Y. Venkata Narasimha Reddy |

పాకిస్థాన్‌(Pakistan) కరాచీలోని మాలిర్ జైలులో ఉన్న 22 మంది భారతీయ జాలర్లు(Indian Fishermens Released)విడుదలయ్యారు. జాలర్లను శనివారం వాఘా సరిహద్దు వద్ధ భారత్‌కు అప్పగించనున్నారు.

Indian Fishermens : పాక్‌ జైలు నుంచి 22 మంది భారత జాలర్లు విడుదల
X

దిశ, వెబ్ డెస్క్ : పాకిస్థాన్‌(Pakistan) కరాచీలోని మాలిర్ జైలులో ఉన్న 22 మంది భారతీయ జాలర్లు(Indian Fishermens Released)విడుదలయ్యారు. జాలర్లను శనివారం వాఘా సరిహద్దు వద్ధ భారత్‌కు అప్పగించనున్నారు. వారి శిక్ష కాలం పూర్తికావడంతో జైలు నుంచి విడుదలైనట్లుగా మాలిర్ జైలు సూపరింటెండెంట్ అర్షద్ షా మీడియాకు సమాచారం ఇచ్చారు. ఈదీ ఫౌండేషన్ అధ్యక్షుడు ఫైసల్ ఈదీ జాలర్లు లాహోర్‌కు చేరుకునేందుకు సహాయ సహకారాలు అందించారు. ప్రయాణ ఖర్చులను భరించడంతో పాటు వారికి పలు కానుకలతో పాటు ఆర్థిక సహాయాన్ని సైతం అందించారు.

వాఘా సరిహద్ధు మీదుగా జాలర్లు లాహోర్‌ నుంచి భారత్‌కు తిరిగి చేరుకోనున్నారు. జాలర్లను పాక్‌ అధికారులు వాఘా సరిహద్దుకు తీసుకువచ్చి భారత అధికారులకు అప్పగించే ప్రక్రియను పూర్తి చేస్తారు. ఆ తర్వాత భారత అధికారులు వారిని సొంత ఊళ్లకు పంపేందుకు ఏర్పాట్లు చేయనున్నారు. ఈ సందర్భంగా ఈదీ ఫౌండేషన్ చైర్మన్ ఫైజల్ ఈదీ మాట్లాడుతూ జాలర్లు సుదీర్ఘంగా జైలు శిక్ష అనుభవించారని.. ఆయా కుటుంబాల వేదనను పరిగణలోకి తీసుకోవాలని వారు స్వదేశానికి తిరిగి పంపేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. దురుద్దేశం లేకుండా అంతర్జాతీయ జలాల సరిహద్దులు దాటుతున్న మత్స్యకారుల పట్ల, పాక్‌ జలాల్లోకి ప్రవేశించిన వారి విషయంలో దయతో ఉండాలని కోరారు.

సముద్ర జలాల్లో చేపల వేటలో ఉండే మత్స్యకారులు అంతర్జాతీయ సముద్ర జలాలను గుర్తించడంలో చేసే పొరపాట్లతో ఓ దేశం వారిని మరో దేశం అరెస్టులు చేసి వారి దేశ చట్టాల మేరకు విచారించి శిక్షలు వేస్తున్నారు. ఇలా అరెస్టయి జైళ్లలో మ్రగ్గుతున్న వారి కోసం ఈ ఏడాది జనవరి ఒకటిన ఇరు దేశాలు ఖైదీల జాబితాను మార్పుడిలు చేసుకున్నాయి. ఈ జాబితా మేరకు.. పాకిస్థాన్‌లో 266 మంది భారతీయ ఖైదీలు ఉండగా.. ఇందులో 217 మంది జాలర్లు ఉన్నారు. ఇక భారత్‌లో 81 మంది జాలర్లు సహా 462 మంది పాక్‌ ఖైదీలు ఉన్నారు. అటు శ్రీలంక జైళ్లలో మగ్గుతున్న జాలర్లను విడిపించేందుకు చర్యలు తీసుకోవాలని తమిళనాడు సీఎం స్టాలిన్‌ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

Next Story