శిక్ష పూర్తయినా విడుదల చేయలేదు.. జైల్లోనే చనిపోయిన భారత మత్స్యకారుడు

by Ajay Maddhiboyina |

పాక్ జలాల్లో అక్రమంగా చేపలు పడుతున్నాడనే కారణంతో బాబుకు రెండేళ్ల కారాగార శిక్ష విధించి, కరాచీ జైలుకు తరలించారు.

శిక్ష పూర్తయినా విడుదల చేయలేదు.. జైల్లోనే చనిపోయిన భారత మత్స్యకారుడు
X

- పాకిస్తాన్ అధికారుల నిర్లక్ష్యం

దిశ, నేషనల్ బ్యూరో:

పాకిస్తాన్ జైలు అధికారుల నిర్లక్ష్యం ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. శిక్ష పూర్తయినా విడుదల చేయకపోవడంతో ఒక భారత మత్స్యకారుడు గురువారం జైల్లోనే మృతి చెందాడు. 2022లో బాబు అనే మత్స్యకారుడు సముద్రంలో చేపల వేటకు వెళ్లి పాకిస్తాన్ కోస్ట్‌గార్డ్‌కు దొరికాడు. పాక్ జలాల్లో అక్రమంగా చేపలు పడుతున్నాడనే కారణంతో బాబుకు రెండేళ్ల కారాగార శిక్ష విధించి, కరాచీ జైలుకు తరలించారు. అయితే బాబు శిక్షాకాలం పూర్తయినా అధికారులు మాత్రం అతడిని విడుదల చేయలేదు. బాబు జైల్లోనే విడుదల కోసం వెయిట్ చేస్తే మృతి చెందినట్లు తెలిసింది. చనిపోవడానికి ముందే శిక్షాకాలం పూర్తి చేసుకున్న మత్స్యకారుడు బాబు ఒక్కడే అని సమాచారం. గత రెండేళ్లలో పాకిస్తాన్‌లో 8 మంది మత్స్యకారులు చనిపోవడం గమనార్హం. కాగా, ఇప్పటికీ పాకిస్తాన్ జైళ్లలో 180 మంది మత్స్యకారులు శిక్ష అనుభవిస్తున్నట్లు సమాచారం. మత్స్యకారులను శిక్షాకాలం కంటే ముందే విడుదల చేయమని భారత అధికారులు సంప్రదింపులు జరుపుతూనే ఉన్నా.. పాకిస్తాన్ మాత్రం స్పందించడం లేదు.

Next Story