- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎయిర్ షోలో ప్రమాదం.. కుప్పకూలిన భారత యుద్ధ విమానం
ఎయిర్ షోలో ప్రమాదం.. కుప్పకూలిన భారత యుద్ధ విమానం

దిశ, వెబ్‌డెస్క్: దుబాయ్ ఎయిర్ షో(Dubai Air Show)లో ప్రమాదం చోటుచేసుకుంది. భారత్‌కు చెందిన తేజస్ యుద్ధ విమానం కుప్పకూలింది. భారత కాలమానం ప్రకారం సరిగ్గా మధ్యాహ్నం 2:10 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో విమానాశ్రయ పరిసన ప్రాంతాల్లో భారీ ఎత్తున మంటలు చెలరేగడంతో పాటు దట్టమైన నల్లటి పొగ కమ్ముకుంది. ఎయిర్ షోను వీక్షించేందుకు వచ్చిన అందరూ భయంతో పరుగులు తీశారు. పైలట్ విమానం నుండి ప్రాణాలతో బయటపడగలిగాడా లేదా అనేది తెలియరాలేదు. ప్రమాద తీవ్రతను చూస్తే బతికే అవకాశం లేదని తెలుస్తోది. అత్యవసర బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. సహాయక చర్యలు ప్రారంభించాయి. ఇందుకు సంబంధించిన దృష్యాలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. కాగా, పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో ఈ తేజస్ యుద్ధ విమానం తయారైన విషయం తెలిసిందే. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. వీడియోలు






