భారత సైన్యం సిద్ధంగా ఉంది.. రాజ్‌నాథ్ ప్రకటన

by Gantepaka Srikanth |

ప్రధాని నరేంద్ర మోడీ(PM Modi)తో కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్(Rajnath Singh) భేటీ అయ్యారు.

భారత సైన్యం సిద్ధంగా ఉంది.. రాజ్‌నాథ్ ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రధాని నరేంద్ర మోడీ(PM Modi)తో కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్(Rajnath Singh) భేటీ అయ్యారు. జమ్మూకశ్మీర్‌లోని పెహల్గాం ఉగ్రదాడి(Terrorist Attack), ఆ తదుపరి చర్యలపై 40 నిమిషాల పాటు సుదీర్ఘంగా చర్చలు జరిపారు. భారత సైన్యం దేనికైనా సిద్ధంగా ఉందని ప్రధాని మోడీతో రాజ్‌నాథ్ చెప్పారు. త్రివిధ దళాలు చాలా ఉత్సాహాంగా ఉన్నాయని అన్నారు. కాగా, పెహల్గాం ఉగ్రదాదిలో దాదాపు 28 మంది టూరిస్టులను మృతిచెందారు. ఇది పాక్ దుశ్చర్యగా భావించిన కేంద్రం.. పాకిస్తాన్‌పై ఆంక్షలు విధించింది. వ్యాపార సంబంధాలను తెంచుకోవడంతో పాటు ఇండియాలో ఉన్న పాకిస్తానీలు తక్షణమే దేశాన్ని విడిచి వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు పాక్ కూడా భారత్‌పై ఆంక్షలు విధించింది. పాక్‌లో స్థిరపడిన భారతీయులను అక్కడినుంచి బలవంతంగా పంపిచేస్తున్నారు. ఈ క్రమంలోనే రెండు దేశాల మధ్య యుద్ధ మేఘాలు కుమ్ముకుంటున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు.. టూరిస్టులపై కాల్పులు జరిపిన టెర్రరిస్టుల కోసం భద్రతా బలగాలు విస్తృతంగా గాలిస్తున్నాయి. ఇప్పటికే ఆ నలుగురి లొకేషన్లను నాలుగుసార్లు ట్రాక్‌ చేయగా.. వారు త్రుటిలో తప్పించుకున్నట్లు అధికారులు తెలిపారు. ఆర్మీ, సీఆర్పీఎఫ్‌ బలగాలు పహల్గాం చుట్టుపక్కల అడవులను జల్లెడ పడుతున్నాయి.

Next Story