Indian companies: నాలుగు భారతీయ కంపెనీలపై అమెరికా ఆంక్షలు.. కారణమిదే ?

by B.Srinivas |

ఇరాన్ పెట్రోలియం ఉత్పత్తుల అమ్మకం, రవాణాలో ప్రమేయం ఉందని ఆరోపిస్తూ భారత్‌లోని నాలుగు చమురు కంపెనీలపై అమెరికా ప్రభుత్వం ఆంక్షలు విధించింది.

Indian companies: నాలుగు భారతీయ కంపెనీలపై అమెరికా ఆంక్షలు.. కారణమిదే ?
X

దిశ, నేషనల్ బ్యూరో: ఇరాన్ పెట్రోలియం ఉత్పత్తుల అమ్మకం, రవాణాలో ప్రమేయం ఉందని ఆరోపిస్తూ భారత్‌లోని నాలుగు చమురు కంపెనీలపై అమెరికా ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఈ మేరకు యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ది ట్రెజరీ ఆఫీస్ ఆఫ్ ఫారిన్ అసెట్స్ కంట్రోల్ (OFAC) 30కి పైగా కంపెనీలు, నౌకలు, వ్యక్తులపై ఆంక్షలు విధించగా వాటిలో నాలుగు భారతీయ కంపెనీలున్నాయి. ఇరాన్ చమురు ఎగుమతులు అక్రమ షిప్పింగ్ నెట్‌వర్క్ ద్వారా జరుగుతున్నాయని అమెరికా ఆరోపిస్తోంది. అందుకే చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపింది. ఇరాన్ తన చమురు అమ్మకాలను సులభతరం చేయడానికి, అస్థిర కార్యకలాపాలకు నిధులు సమకూర్చుకోవడానికి ఓడలు, షిప్పర్లు, బ్రోకర్ల నెట్‌వర్క్‌పై ఆధారపడటం కొనసాగిస్తోందని ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ (Scott bessent) తెలిపారు.

యూఎస్ ఆంక్షలు విధించిన భారతీయ సంస్థలలో ఆస్టెన్‌షిప్ మేనేజ్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ (నోయిడా), BSM మెరైన్ లిమిటెడ్ (గుర్గావ్), కాస్మోస్ లైన్స్ (తంజావూర్), ఫ్లక్స్ మారిటైమ్ (నవీ ముంబై) ఉన్నాయి. వీటిలో 3 ఇరానియన్ చమురు, పెట్రోలియం ఉత్పత్తుల రవాణాలో పాల్గొన్న ఓడల వాణిజ్య, సాంకేతిక నిర్వహణ కారణంగా నిషేధించబడగా ఇరానియన్ పెట్రోలియం రవాణాలో పాల్గొన్నందుకు కాస్మోస్ లైన్స్‌ను నిషేధించారు. అంతేగాక ఇరాన్, ఉత్తర కొరియా, చైనా, యూఏఈ సహా అనేక దేశాలపై ఆంక్షలు విధించింది. ఇరాన్ చమురు సరఫరా గొలుసు యొక్క అన్ని అంశాలను లక్ష్యంగా చేసుకోవడానికి అమెరికా మా వద్ద ఉన్న అన్ని సాధనాలను ఉపయోగిస్తుందని, ఇరాన్ చమురుతో ప్రమేయం ఉన్న ఎవరైనా ఆంక్షలకు గురికాక తప్పదని యూఎస్ స్పష్టం చేసింది.

Next Story