- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Shubhanshu Shukla: శుభాన్షు శుక్లా ఐఎస్ఎస్ మిషన్ జూన్ 8కి వాయిదా
ఈ విషయాన్ని యాక్సియం స్పేస్, నాసా అధికారిక ప్రకటనలో వెల్లడించాయి.

దిశ, నేషనల్ బ్యూరో: భారత వ్యోమగామి గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లా పైలట్‌గా మరో ముగ్గురు సిబ్బందితో కూడిన రోదసియాత్ర వాయిదా పడింది. యాక్సియం-4 మిషన్‌లో భాగంగా ఈ నెల 29న అంతర్జాఈయ అంతరిక్ష కేంద్రానికి(ఐఎస్ఎస్)కు వెళ్లాల్సి ఉండగా, సాంకేతిక కారణాల వల్ల జూన్ 8కి వాయిదా వేశారు. ఈ విషయాన్ని యాక్సియం స్పేస్, నాసా అధికారిక ప్రకటనలో వెల్లడించాయి. భారత కాలమానం ప్రకారం.. జూన్ 8న సాయంత్రం 6.41 గంటలకు(అమెరికాలో స్థానిక కాలమానం ఉదయం 9.11 గంటలు) ఫ్లోరిడాలో ఉన్న కెనడీ అంతరిక్ష కేంద్రం నుంచి స్పేస్ఎక్స్‌కు చెందిన డ్రాగన్ అంతరిక్ష నౌకలో శుభాన్షు శుక్లా రోదసిలోకి పయనించనున్నారు. ఇందులో ఆయనతో పాటు అమెరికాకు చెందిన పెగీ విట్సన్, పోలండ్‌కు చెందిన స్లావోస్జ్ ఉజ్ఞాన్స్కీ, హంగేరీకి చెందిన కపు టిబోర్ ఉంటారు. వీరు 14 రోజుల పాటు ఐఎస్ఎస్‌లో పరిశోధనలు చేయనున్నారు. 1984లో భారత వ్యోమగామి రాకేశ్ శర్మ తర్వాత భారత్‌కు చెందిన శుభాన్షు శుక్లా ఐఎస్ఎస్‌కు వెళ్లనుండటం విశేషం. అమెరికా అంతరిక్ష సంస్థ(నాసా), భారత రోదసి పరిశోధన సంస్థ (ఇస్రో) సంయుక్తంగా నిర్వహితున్న ఈ యాత్రలో శుభాన్షు శుక్లా ఏడు ప్రయోగాలను అధ్యయనం చేస్తారు.






