- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మరో వీడియో షేర్ చేసిన భారత సైన్యం.. చూస్తే గూస్ బంప్స్ ఖాయం
పహల్గాం ఉగ్ర దాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) చేపట్టి పాకిస్థాన్‌లోని ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్: పహల్గాం ఉగ్ర దాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) చేపట్టి పాకిస్థాన్‌లోని ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. ఇందుకు ప్రతీకారంగా పాక్ సైతం డ్రోన్ దాడులకు పాల్పడింది. ఇండియా వాటిని చాకచక్యంగా ఎదురుకుని దాయాది దేశానికి చుక్కలు చూపించింది. అంతేకాదు, ఆపరేషన్ సింధూర్‌లో పాకిస్థాన్‌కు ఇంతవరకూ భారత్ ట్రైలర్ మాత్రమే చూపించిందని, మళ్లీ తోక జాడిస్తే అసలు సినిమా ముందుముందు చూపిస్తామంటూ భారత త్రివిధ దళాలు తమ సామర్థ్యాలపై స్ట్రాంగ్ మెసేజ్ ఇస్తూ కొద్ది రోజులుగా వీడియోలు షేర్ చేస్తున్నాయి. తాజాగా ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ (Indian Air Force) తన ఎక్స్ ఖాతాలో మరో వీడియోను పంచుకుంది.
ఈ వీడియోకు 'ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ఎల్లప్పుడూ దృఢ సంకల్పంతో ప్రతిస్పందిస్తుంది' అనే క్యాప్షన్ ఇచ్చి.. తన సంసిద్ధత, సామర్థ్యాన్ని అందులో ప్రదర్శించింది. శత్రు స్థావరాలపై మిసైల్ దాడులు, వైమానిక దళ విన్యాసాలు, ఆయుధ సంపత్తి, కమాండర్ల వేగవంతమైన ప్రతిస్పందన ఎలా ఉంటుందో చూపించింది. ఈ వీడియోతో ప్రతి భారతీయుడికి గూస్‌బంప్స్ తెప్పిస్తోంది. బ్యాక్‌గ్రౌండ్‌లో వినిపిస్తోన్న మ్యూజిక్ వీడియోను మరింత ఆకట్టుకునే చేస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.






