Ceasefire: నియంత్రణ రేఖ వెంబడి కాల్పుల విరమణ కొనసాగుతోంది- ఆర్మీ

by Shamantha N |

నియంత్రణ రేఖ వెంబడి కాల్పుల విరమణ కొనసాగుతోందని భారత ఆర్మీ(Indian Army) పాక్‌ ప్రకటించింది. పొరుగు దేశం పాకిస్థాన్‌ (Pakistan) మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడిందని వార్తలు కొట్టిపారేసింది.

Ceasefire: నియంత్రణ రేఖ వెంబడి కాల్పుల విరమణ కొనసాగుతోంది- ఆర్మీ
X

దిశ, నేషనల్ బ్యూరో: నియంత్రణ రేఖ వెంబడి కాల్పుల విరమణ కొనసాగుతోందని భారత ఆర్మీ(Indian Army) పాక్‌ ప్రకటించింది. పొరుగు దేశం పాకిస్థాన్‌ (Pakistan) మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడిందని వార్తలు కొట్టిపారేసింది. ఈ నేపథ్యంలో ఆర్మీ ప్రకటన విడుదల చేసింది. "ఎల్‌ఓసీలో వరుస కాల్పుల ఘటనలు, ఐఈడీ పేలుడు వల్ల ఏర్పడిన ఉద్రిక్తతలను పరిష్కరిస్తున్నాం. భారీ-క్యాలిబర్ ఆయుధాలతో కాల్పులు జరగలేదు. ఎల్‌ఓసీ వెంబడి తరచుగా ఇలాంటి చిన్న ఘటనలు జరగడం సహజమే" అని స్పష్టం చేసింది. సరిహద్దుల్లో పరిస్థితి స్థిరంగా ఉందని.. నిశితంగా పరిశీలిస్తున్నామని తెలిపింది. సరిహద్దుల్లో భారత సైన్యం అధిక అప్రమత్తతను కొనసాగిస్తోందని.. నియంత్రణ రేఖపై ఆధిపత్యం చెలాయిస్తోందని ఆర్మీ ప్రకటించింది.

కాల్పులు జరిగినట్లు కథనాలు..

అయితే, పాక్ సరిహద్దుల వెంబడి కాల్పుల విరమణ (Ceasefire) ఒప్పందాన్ని ఉల్లంఘించిందని వార్తలు వచ్చాయి. నియంత్రణ రేఖ (LoC) వెంబడి కాల్పులకు పాల్పడినట్లు జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. జమ్ము కశ్మీర్‌లోని పూంఛ్‌ జిల్లాలో గల మెంధార్ సెక్టార్‌ (Mendhar sector)లో బుధవారం రాత్రి కవ్వింపు చర్యలకు పాల్పిడనట్లు పేర్కొంది. నియంత్రణ రేఖ వెంబడి తార్కుండి ప్రాంతంలో ఉన్న ఫార్వర్డ్‌ పోస్ట్‌పై పాకిస్థాన్‌ సైన్యం కాల్పులు జరిపినట్లు పేర్కొంది. దాదాపు 10 నుంచి 15 రౌండ్లు కాల్పులు జరిపిందంది. భారత బలగాల ఎదురుకాల్పుల్లో భారీగా ప్రాణనష్టం జరిగినట్లు పేర్కొంది. ఇలాంటి సమయంలో ఆర్మీ ప్రకటన విడుదల చేసింది. కాగా, 2021 ఫిబ్రవరి 25న భారత్‌ – పాకిస్థాన్‌ మధ్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని పునరుద్ధరించినప్పటి నుంచి నియంత్రణ రేఖ వెంబడి కాల్పుల విరమణ ఉల్లంఘన చాలా అరుదు. అయితే, ఇటీవలే పాకిస్థాన్‌ ఎక్కడో ఒకచోట కవ్వింపులకు పాల్పడుతూ వస్తోంది. ఫిబ్రవరి 4, 5 తేదీల్లో కొంతమంది చొరబాటుదారులు భారత భూభాగంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించగా భారత సైన్యం వారిపై కాల్పులు జరిపింది. ఈ ఘటనలో ఏడుగురు హతమయ్యారు. వీరిలో కొందరు పాక్‌ భద్రతా సిబ్బంది కూడా ఉన్నట్లు వార్తలు వచ్చాయి.

Next Story