- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Live shell destroyed: జమ్మూకశ్మీర్ సరిహద్దులో పాక్ లైవ్ షెల్.. ధ్వంసం చేసిన ఇండియన్ ఆర్మీ
జమ్మూ కాశ్మీర్ సరిహద్దు గ్రామంలో పాక్ ప్రయోగించిన ఓ పాకిస్తాన్ లైవ్ షెల్ బయటపడింది.

దిశ, డైనమిక్ బ్యూరో: (Jammu Kashmir)జమ్మూ కాశ్మీర్ సరిహద్దు గ్రామంలో పాక్ ప్రయోగించిన ఓ లైవ్ షెల్ (Pakistani live shell) బయటపడింది. స్థానికుల భద్రతను దృష్టిలో ఉంచుకోని దాన్ని విజయవంతంగా ఇండియన్ ఆర్మీ నిర్వీర్యం చేసింది. (Operation Sindoor) ఆపరేషన్ సిందూర్‌లో మిషన్‌తో ఇటీవల పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకగా భారత సైన్యం పాకిస్తాన్, పీవోకేలోని ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. దీంతో పాకిస్తాన్ తన వక్రబుద్ధిని ప్రదర్శిస్తూ భారత సరిహద్దు గ్రామాల్లో ప్రజలు, ఆర్మీపై దాడులకు పాల్పడింది. ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ సరిహద్దు ప్రాంతాల్లో డ్రోన్స్, బాంబ్ షెల్స్ ప్రయోగించింది.
వాటిని భారత సైన్యం (Indian Army) సమర్ధవంతంగా తిప్పికొట్టింది. ఉద్రిక్తతల నేపథ్యంలో అధికారులు సరిహద్దు గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తాజాగా కాల్పుల విరమణ నేపథ్యంలో ప్రజలు తిరిగి గ్రామాలకు చేరుకున్నారు. ఈ క్రమంలోనే పాకిస్తాన్ ప్రయోగించిన ఓ లైవ్ షెల్ పూంచ్‌లో రోడ్డు పక్కన ఉండటాన్ని మంగళవారం స్థానికులు గుర్తించారు.
ఈ విషయాన్ని వెంటనే ఇండియన్ ఆర్మీ, లోకల్ పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే రంగంలోకి దిగిన భద్రతా బలగాలు షెల్‌ను పేల్చేశాయి. దీంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు. కాగా, ఇటీవల సంఘర్షణల మధ్య జమ్మూ కాశ్మీర్‌లోని సరిహద్దు ప్రాంతాలు పాకిస్తాన్ భారీ షెల్లింగ్ దాడులకు పాల్పడింది. ముఖ్యంగా పూంచ్ (Poonch) ప్రాంత ప్రజలు తీవ్రంగా ప్రభావితమయ్యారు. స్థానికులు తమ పశువులు, ఆస్తులు, ముఖ్యంగా జీవనోపాధి కోల్పోయినట్లు నివేదికలు ఉన్నాయి. ఈ దాడుల్లో 25 మంది ప్రాణాలు కోల్పోయినట్లు నివేదికలు చెబుతున్నాయి.






