- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ట్రంప్‌పై 71 శాతం భారతీయ అమెరికన్లు గుస్సా
ట్రంప్‌పై 71 శాతం భారతీయ అమెరికన్లు గుస్సా. రెండో టర్మ్ పాలనపై ఏమాత్రం సంతోషంగా లేరు.

దిశ, నేషనల్ బ్యూరో: యూఎస్‌లోని 71 శాతం మంది భారతీయ అమెరికన్లు.. డొనాల్డ్ ట్రంప్ పాలనతో సంతోషంగా లేరు. ఈ విషయం తాజాగా నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. ఇండియన్ అమెరికన్ యాటిట్యూడ్స్ సర్వే 2026 (ఐఏఏఎస్) ప్రకారం, రెండో టర్మ్ అధ్యక్షుడిగా ట్రంప్ పనితీరు సంతృప్తికరంగా లేదు. మొత్తం వెయ్యిమంది భారతీయ అమెరికన్లు ఈ సర్వేలో పాల్గొనగా.. కేవలం 29 శాతం మంది మాత్రమే ట్రంప్ బాగా పనిచేస్తున్నారని అభిప్రాయపడ్డారు. అలాగే భారత్‌తో యూఎస్ సంబంధాలపై కూడా ప్రవాస భారతీయులు సంతృప్తిగా లేనట్లు తెలుస్తోంది. ట్రంప్ కీలకమైన విధానాలపై కూడా ఈ సర్వేలో భారతీయ అమెరికన్లు అసహనం వ్యక్తంచేశారు. మొత్తం 64 శాతం మందికి ట్రంప్ వలస విధానాలు నచ్చలేదు. అమెరికన్ ఆర్థిక వ్యవస్థను ట్రంప్ నడుపుతున్న తీరుపై 68 శాతం మంది పెదవి విరిచారు. ఆయన అంతర్జాతీయ ఆర్థిక విధానాలపై 70 శాతం మంది అసంతృప్తి వ్యక్తంచేశారు. ఇక భారత్ విషయంలో ట్రంప్ విధానాలను 55 శాతం మంది తప్పుబట్టారు. 20 శాతం మంది ప్రెసిడెంట్‌కు మద్దతు తెలపగా.. సుమారు 25 శాతం మంది ఎలాంటి అభిప్రాయం చెప్పలేదు.
ఫ్లోరిడా ఎయిర్‌పోర్టుకు ట్రంప్ పేరు..!
అమెరికాలోని ఫ్లోరిడాలో ఉన్న పామ్ బీచ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ పేరును పెట్టనున్నారు. దీనికోసం ప్రవేశపెట్టిన బిల్లుకు ఫ్లోరిడా సెనేట్ ఆమోదం తెలిపింది. ఆ రాష్ట్ర గవర్నర్ రాన్ డిశాంటిస్ త్వరలోనే ఈ బిల్లుపై సంతకాలు చేస్తారని తెలుస్తోంది. అయితే ఎయిర్‌పోర్టు మార్చేందుకు ఫెడరేషన్ ఏవియేషన్ అథారిటీ ఆమోదం కూడా అవసరం. దీనికోసం ఫ్లోరిడా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.






