ఇండియన్ ఎయిర్ ఫోర్స్ స్పెషల్ వీడియో... గూస్ బంప్స్ పక్కా

by Muthe.Rajitha |

ఇండియన్ ఎయిర్ ఫోర్స్(IAF) తాజాగా విడుదల చేసిన ఓ వీడియో గూస్ బంప్స్ తెప్పిస్తోంది.

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ స్పెషల్ వీడియో... గూస్ బంప్స్ పక్కా
X

దిశ, వెబ్ డెస్క్ : ఇండియన్ ఎయిర్ ఫోర్స్(IAF) తాజాగా విడుదల చేసిన ఓ వీడియో గూస్ బంప్స్ తెప్పిస్తోంది. "ఇండియన్ ఎయిర్ ఫోర్స్.. టచ్ ది స్కై విత్ గ్లోరీ" పేరిట తన ఎక్స్ ఖాతాలో రిలీజ్ చేసిన ఈ వీడియోలో భారత వైమానిక దళాలు సాధించిన విజయాలను పొందుపరిచారు. వైమానిక దళ ప్రస్థానంలో.. 1971లో బంగ్లాదేశ్ తో జరిగిన యుద్ధంలో ఢాకాలో గవర్నర్ హౌజ్ పై దాడితోపాటు, పాక్ కార్గిల్ యుద్ధంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సాధించిన విజయాలు ఉన్నాయి. అలాగే పూల్వమా అటాక్ కు ప్రతీకారంగా బాలాకోట్ సర్జికల్ స్ట్రైక్, పహల్గామ్ ఉగ్రవాదుల దాడి అనంతరం ఆపరేషన్ సింధూర్ పేరిట పాక్ వైమానిక స్థావరాలను ధ్వంసం చేయడంలో IAF సత్తా వంటి వీడియోలు ప్రతి భారతీయునికి గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి.

అలాగే దేశంలో వివిధ సందర్భాల్లో జరిగిన ప్రకృతి విపత్తుల్లో భారత వైమానిక దళం ముందుండి ప్రజలకు అందించిన సహాయక చర్యల తీరును కళ్ళకు కట్టారు. ఈ వీడియో చూసిన నెటిజన్స్ భారత వైమానిక దళ సామర్థ్యానికి, విజయాలకు జయహో అంటున్నారు. నిజంగానే భారతదేశ కీర్తి ఆకాశాన్ని తాకేలా చేసారంటూ కొనియాడుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.

Next Story