- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జెమిని, చాట్‌జీపీటీలకు చెక్ పెడుతున్న దేశీయ ‘సర్వం విజన్’
జెమిని, చాట్‌జీపీటీలకు చెక్ పెడుతున్న దేశీయ ‘సర్వం విజన్’. యూజర్లు, ఎక్స్‌పర్టులు కూడా దీనికి దాసోహం అంటున్నారు.

దిశ, నేషనల్ బ్యూరో: అంతర్జాతీయంగా ఏఐ మోడల్స్ గురించి మాట్లాడితే.. కేవలం యూఎస్, చైనా గురించే చర్చ జరుగుతుంది. భారత్‌లో ఎంతో నైపుణ్యమైన యువత ఉన్నా.. ఏఐ మోడల్స్ విషయంలో మాత్రం మన దేశం ముందడుగు వేయలేదు. ఈ పరిస్థితిని మార్చడంలో బెంగళూరుకు చెందిన స్టార్టప్ కంపెనీ తొలి అడుగు వేసింది. ఈ కంపెనీ తీసుకొచ్చిన ‘సర్వం విజన్’ అద్భుతమైన ఫలితాలను అందుకుంది. దీంతోపాటు ‘టెక్స్ట్ టు స్పీచ్’ అవసరాల కోసం తెచ్చిన ‘బుల్ బుల్ వీ3’ కూడా అందరి నుంచి ప్రశంసలు అందుకుంటోంది. భారతీయ భాషల్లో ఏఐ సేవలు అందించే ఆలోచనతో తీసుకొచ్చిన ఈ ఏఐ టూల్స్‌పై ఆరంభంలో కొందరు పెదవి విరిచారు. కానీ ఇప్పుడు వారే దాసోహం అంటున్నారు. తాజాగా చేసిన పరీక్షల్లో సర్వం విజన్ ఏకంగా చాట్‌జీపీటీ, గూగుల్ జెమిని, ఆంథ్రోపిక్ క్లాడ్‌ను కూడా కొన్ని అంశాల్లో వెనక్కు నెట్టేయడం గమనార్హం. ఫొటోలు చూసి వాటిలోని అక్షరాలను గుర్తించే ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నిషన్ (ఓసీఆర్) ఈ ‘సర్వం విజన్’ ప్రత్యేకత. ఈ అంశంలో బడా ఏఐ కంపెనీలకు కూడా ఇది చెక్ పెట్టింది.
బడా ఏఐలను వెనక్కు నెట్టి..
ఓసీఆర్ విభాగంలో తాము తయారు చేసిన ‘సర్వం విజన్’ బడా కంపెనీల కన్నా మెరుగైన ఫలితాలు సాధించినట్లు సర్వం ఏఐ సంస్థ సహవ్యవస్థాపకుడు ప్రత్యూష్ కుమార్ వెల్లడించారు. ఈ విషయంలో సర్వం విజన్ ఏకంగా 84.3 శాతం కచ్చితత్వంతో సమాధానాలిచ్చినట్లు వెల్లడించారు. ఇది జెమిని 3 ప్రో, డీప్‌సీక్ ఓసీఆర్ వీ2 వంటి లేటెస్ట్ మోడల్స్ కన్నా చాలా ఎక్కువ. ఇక చాట్‌పీజీటీ ఈ విషయంలో చాలా తక్కువ మార్కులు సాధించడం గమనార్హం. అదే సమయంలో ఓమన్నిడాక్‌బెంచ్ వీ1.5లో కూడా సర్వం విజన్ అద్భుతమైన స్కోరు సాధించినట్లు తెలుస్తోంది. క్లిష్టమైన డాక్యుమెంట్స్‌ను చదివి అర్థం చేసుకునే సామర్థ్యాన్ని తెలుసుకోవడానికి ఈ టెస్టు పెడతారు. ఈ పరీక్షలో సర్వం విజన్ ఏకంగా 93.28 శాతం మార్కులు సాధించడం విశేషం.
భారతీయ భాషలే టార్గెట్..
సర్వం విజన్ సాధించిన సక్సెస్ చూసిన అంతర్జాతీయ సంస్థలు కూడా ఆశ్చర్యపోతున్నాయి. ఈ సంస్థలు భారతీయ భాషలను పెద్దగా పట్టించుకోవు. కానీ సర్వం విజన్ భారతీయ భాషల్లోనే సేవలు అందిస్తోంది. దీంతో భారత్‌లో బడా ఏఐ కంపెనీలు చేయలేని పనిని సర్వం చేస్తోందని విమర్శకులు కొనియాడుతున్నారు. గతంలో ఈ కంపెనీని ప్రశ్నించిన వారు కూడా ప్రస్తుతం సర్వం విజన్ పనితీరు చూసి ఆశ్చర్యపోతున్నారు. టెక్స్ట్ టు స్పీచ్, స్పీచ్ టు టెక్స్ట్, ఓసీఆర్ మోడల్స్‌లో సర్వం బెస్ట్ అంటున్నారు.
బుల్ బుల్ వీ3 అదరహో
ఇదే ఊపులో భారతీయ భాషల్లో ఏఐ వాయిస్ అందించే ‘బుల్ బుల్ వీ2’ని కూడా ఈ కంపెనీ తీసుకొచ్చింది. ఎలెవెన్‌ల్యాబ్స్ వంటి ప్రముఖ సంస్థలు అందించే ఏఐ వాయిస్ సేవలనే బుల్ బుల్ కూడా అందిస్తుంది. ఈ టూల్‌ను విడుదల చేస్తూ.. ‘బుల్‌బుల్ వీ2 ఫెయిల్యూర్ మోడల్స్‌ను తగ్గిస్తుందని, కంటెంట్‌కు సరిపోయే సరైన వాయిస్ అందిస్తుంది. ప్రత్యేకంగా భారతీయ యూజ్ కేస్‌లలో ఇది మెరుగైన ఫలితాలిస్తుంది’ అని సర్వం ఏఐ సంస్థ పేర్కొంది. మొత్తం 11 భారతీయ భాషల్లో 35పైగా స్వరాలను ప్రస్తుతం ‘బుల్‌బుల్ వీ3’ అందిస్తోంది. దీన్ని 22 భాషలకు పెంచేందుకు ఈ సంస్థ ప్రయత్నిస్తోంది. ఈ బుల్‌బుల్ ఏఐ వాయిస్ ఉపయోగించిన కొందరు యూజర్లు.. ఈ టూల్‌ను తెగ మెచ్చుకుంటున్నారు. ఎలెవెన్‌ల్యాబ్స్‌కు అంత డబ్బు ఖర్చు పెట్టడం కంటే.. ‘బుల్‌బుల్ వీ2’ వాడుకోవడం బెటర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.






