- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Deepfake: డీప్ ఫేక్ కు ‘టెక్నో-లీగల్’ తో చెక్.. త్వరలో కేంద్రం కీలక నిర్ణయం
భారత్‌లో డీప్‌ఫేక్‌లను ఎదుర్కొనే నిబంధనలు త్వరలోనే తీసుకురానున్నట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.

దిశ, డైనమిక్ బ్యూరో: అన్ని రంగాల్లోకి దూసుకొస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారంగా డీప్ ఫేక్‍ను (Deepfake) ఉపయోగించుకుని కొంత మందికేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. మహిళలు, చిన్నారులతో పాటు నేరాల కోసం ఎదుటివారి ఫోటోలు, వీడియోలను తప్పుడుగా చూపిస్తున్నారు. ఇటువంటి వాటికి చెక్ పెట్టే విషయంలో కేంద్ర మంత్రి అశ్వినీ కుమార్ వైష్ణవ్ (Ashwini Vaishnaw) కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్‌లో డీప్‌ఫేక్‌లను ఎదుర్కొనేందుకు అతి త్వరలోనే నిబంధనలు (Deepfake Regulations) తీసుకురానున్నట్లు ఆయన ఇవాళ ఓ టీవీ చానల్ నిర్వహించిన సమ్మిట్‍లో ప్రకటించారు. కేవలం కాగితంపై చట్టంగా పరిమితం కాకుండా టెక్నాలజీ, లీగాలిటీతో రెండు విధాలుగా ఈ డీప్ ఫేక్‍ను అడ్డుకోబోతున్నట్లు వెల్లడించారు. ఏఐ ప్రపంచాన్ని కేవలం చట్టం ఆమోదించడం ద్వారా నియంత్రించలేమని దానికి సాంకేతిక పరిష్కారం కూడా ఉండాలన్నారు. ఏఐ ద్వారా యువకులను వృద్ధులుగా, వృద్ధులను యువకులుగా చూపించడం వంటి ఆహ్లాదకరమైన విషయాలు చేయవచ్చు. ఇది హాస్యానికి బాగుటుంది. కానీ డీప్‌ఫేక్‌లు మానవులు ఇంతకు ముందు ఎన్నడూ చూడని విధంగా సమాజానికి హాని కలిగించవచ్చని ఆయన హెచ్చరించారు.
90 శాతానికి పైగా కచ్చితత్వానికి చేరుకున్నాం:
కొన్ని నెలల క్రితం రాజకీయ నాయకులను చిన్న పిల్లలుగా చూపించే ఒక చక్కని వీడియో వచ్చింది. అది చాలా ఆసక్తికరంగా ఉంది. ఇది ఏఐ యొక్క ఆసక్తికరమైన అంశం అని వీటితో ఎలాంటి హానీ లేదని అందువల్ల ఇలాంటి వాటిని ప్రోత్సహించాలన్నారు. కానీ మీ గొంతు, మీ ముఖం ఉపయోగించి మీతో సంబంధం లేని సందేశాన్ని ప్రచారం చేయడం ద్వారా తీవ్రమైన హాని కలిగించే డీప్‌ఫేక్‌ల నుండి సమాజాన్ని కాపాడటం చాలా ముఖ్యం అన్నారు. మీ ముఖం, మీ గొంతు సమాజానికి హానికరమైన రీతిలో ఉపయోగించబడకుండా చూసుకోవడం మీ హక్కు అని చెప్పారు. ఏఐ సేఫ్టీ ఇన్‌స్టిట్యూట్‌లో చాలా సంక్లిష్టమైన సమస్యలపై పనిచేస్తున్నారని, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ జోధ్‌పూర్ 90 శాతానికి పైగా ఖచ్చితత్వంతో డీప్‌ఫేక్‌లను గుర్తించే పరిష్కారాన్ని అభివృద్ధి చేసిందని ఆయన వివరించారు. ఒక దేశంగా, ప్రభుత్వంగా మా దృష్టి ఆవిష్కరణలపై ఉంది. అదే సమయంలో, సమాజాన్ని సంభావ్య హాని నుండి కాపాడాలి, అందుకే మేము టెక్నో-లీగల్ విధానాన్ని అవలంభించబోతున్నామని చెప్పారు.
కాగా గతంలో యాక్టర్ రష్మికా డీప్ ఫేక్ వీడియో బాగా వైరల్ అయింది. ఆ వీడియోపై తీవ్ర స్థాయిలో అభ్యతంరం వ్యక్తం అయింది. మొన్నటికి మొన్న ఏపీముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి దేవినేని ఉమా పేరుతో డీప్ ఫేక్ వీడియో కాల్ చేసిన దుండగులు ఖమ్మం జిల్లాలాకు చెందిన వారిని మోసగించిన సంగతి తెలిసిందే. ఇలాంటి ఘటనలు రోజు రోజుకు పెరిగిపోతున్న నేపథ్యంలో కేద్ర ప్రభుత్వం డీప్ ఫేక్‍పై నిబంధనలు ఎలా ఉండబోతున్నాయో చూడాలి మరి.






