- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రెండేళ్లలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ : కేంద్రమంత్రి అమిత్ షా
భారత్ అభివృద్ధి చెందిన దేశాలతో పోటీపడుతూ వేగంగా పురోగమిస్తోందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా (Amit Shah) పేర్కొన్నారు. ఉత్తరాఖండ్‌లోని రుద్రపుర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ..

దిశ, వెబ్‌డెస్క్: భారత్ అభివృద్ధి చెందిన దేశాలతో పోటీపడుతూ వేగంగా పురోగమిస్తోందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా (Amit Shah) పేర్కొన్నారు. ఉత్తరాఖండ్‌లోని రుద్రపుర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. 2027 నాటికి భారత్ ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 2014లో ఎన్డీఏ ప్రభుత్వం (NDA Government) అధికారంలోకి వచ్చిన తర్వాత దేశ అభివృద్ధి వేగంగా సాగుతోందని ఆయన తెలిపారు. గత పదేళ్లలో అభివృద్ధి శాతం 60కి చేరిందన్నారు. దేశవ్యాప్తంగా దాదాపు 45 వేల కిలోమీటర్ల రైల్వే లైన్లు, రహదారులు నిర్మించామని చెప్పారు.
అటల్ బిహారీ వాజ్‌పేయీ పాలనలో భారత్ 11వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉండగా, నరేంద్ర మోదీ నేతృత్వంలో అది నాలుగో స్థానానికి చేరిందని, తదుపరి లక్ష్యం మూడవ స్థానమని వెల్లడించారు. 2047 నాటికి భారత్‌ను పూర్తిగా అభివృద్ధి చెందిన దేశంగా మార్చేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ లక్ష్యంగా పెట్టుకున్నారని, అందుకోసం కేంద్రం కృషి చేస్తున్నదని తెలిపారు. అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (IMF) అంచనాల ప్రకారం.. ప్రస్తుతం అమెరికా, చైనా, జర్మనీ మాత్రమే భారత్‌కు ముందు ఉన్నాయని పేర్కొన్నారు. ఇదే గతి కొనసాగితే, మరో మూడేళ్లలో భారత్ జర్మనీని అధిగమించి మూడవ స్థానానికి చేరుతుందన్నారు. ఇందుకోసం మూలధన వ్యయాలను పెంచడం, వ్యాపార ప్రక్రియలను సులభతరం చేయడం, విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం వంటి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.
అంతేకాక.. ఉత్తరాఖండ్‌ను ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని సంకల్పించామన్నారు. రాబోయే రోజుల్లో దేశం నలుమూలల నుంచి కాదు, ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకులు ఉత్తరాఖండ్‌కి రావాలని, తాము అవసరమైన వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు.






