- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మాపై దాడి చేస్తే భారత్ సమాధి అవుతుంది.. పాక్ రక్షణ మంత్రి సంచలన వ్యాఖ్యలు
ఆపరేషన్ సిందూర్ తో కోలుకోలేని దెబ్బ తిన్న పాకిస్తాన్ భారత ప్రభుత్వంతో కాళ్లబేరానికి వచ్చి శాంతి చర్చలు జరిపింది.

దిశ, వెబ్ డెస్క్: ఆపరేషన్ సిందూర్ తో కోలుకోలేని దెబ్బ తిన్న పాకిస్తాన్ భారత ప్రభుత్వంతో కాళ్లబేరానికి వచ్చి శాంతి చర్చలు జరిపింది. అనంతరం తమ వంకర బుద్దిని చూపిస్తూ.. భారత ప్రభుత్వమే తమతో కాల్పుల విరమణకు వచ్చిందని, యుద్ధంలో తామే గెలిచామని ప్రకటించుకున్న సంగతి తెలిసిందే. తాజాగా పాక్ ప్రధాని ట్రంప్ జోక్యంతోనే భారత్, పాక్ సమస్య సర్దుమనిగిందని చెప్పుకొచ్చి తమ పరువును పాక్ సొంతంగా తీసుకుంది. ఇదిలా ఉంటే ఇటీవల భారత ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది.. ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పోషిస్తే.. ప్రపంచ పటంలో పాక్ లేకుండా చేస్తామని వార్నింగ్ ఇచ్చారు.
అలాగే పాకిస్తాన్ పై ఆపరేషన్ సిందూర్ 1.0లో చూపిన సహనాన్ని 2.0లో చూపించమని, ఈ సారి దాడి చేస్తే పాకిస్తాన్ చిత్రపటం చెరిగిపోతుందని భారత ఆర్మీ చీఫ్ సంచలన వార్నింగ్ ఇచ్చారు. కాగా భారత ఆర్మీ చీఫ్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చే విధంగా పాకిస్తాన్ రక్షణ మంత్రి మాట్లాడుతూ.. భారత్ తమ స్థాయికి మించి మాట్లాడుతుందని, భవిష్యత్తులో పాకిస్తాన్ పై సైనిక దాడి జరిగితే.. సొంత యుద్ధ విమానాల కింద భారత్ సమాధి అవుతుందని పాకి రక్షణ మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు స్పందిస్తూ.. పాక్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన.. నేటికి తమ స్వభావం మార్చుకోలేదని, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూనే ఉందని ఆపరేషన్ సిందూర్ విజువల్స్ ట్యాగ్ చేస్తూ.. ట్రోల్ చేస్తున్నారు.






