- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Amit Shah : ప్రపంచ పోలీస్ క్రీడలకు భారత్ ఆతిథ్యం : అమిత్ షా
by Muthe.Rajitha |
భారత్ మరో అంతర్జాతీయ క్రీడలకు అతిధ్యం ఇవ్వనుంది.

X
దిశ, వెబ్ డెస్క్ : భారత్ మరో అంతర్జాతీయ క్రీడలకు అతిధ్యం ఇవ్వనుంది. 2029లో జరగనున్న ప్రతిష్టాత్మక ప్రపంచ పోలీస్ గేమ్స్(World Police Games 2029) కు ఇండియా అతిధ్యం ఇవ్వనున్నట్టు కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా(Amit Shah) ప్రకటించారు. ఈ క్రీడలకు గుజరాత్ లోని అహ్మదాబాద్(Ahmadabad) వేదిక అవనుందని, ఈ అవకాశం దక్కడం దేశానికే గర్వకారణం అని పేర్కొన్నారు. ప్రపంచ పోలీస్ గేమ్స్ నిర్వహణ బిద్ ను భారత్ గెలుచుకుందని వెల్లడించిన అమిత్ షా, మనదేశంలో ఉన్న క్రీడా మౌలిక సదూపాయాలకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు లభిస్తుందని అన్నారు.
కాగా 1985 నుంచి ప్రపంచ పోలీస్ గేమ్స్ ప్రతీ రెండేళ్లకోసారి జరుగుతున్నాయి. 2007 నుంచి భారత్ ఈ గేమ్స్ లో పాల్గొంటుందని, 2023 వరకు 1400 పథకాలు భారత పోలీస్ సిబ్బంది గెలుచుకున్నారని అమిత్ షా వివరించారు.
Next Story






