భారత్‌కు తొలి బ్యాచ్ అపాచే హెలికాప్టర్లు.. 15 నెలల డిలే తర్వాత డెలివరీ!

by Phanindra |

భారత్‌కు తొలి బ్యాచ్ అపాచే హెలికాప్టర్లు వస్తున్నట్లు అధికార వర్గాలు చెప్తున్నాయి. 15 నెలల డిలే తర్వాత డెలివరీ జరగనున్నట్లు సమాచారం.

భారత్‌కు తొలి బ్యాచ్ అపాచే హెలికాప్టర్లు.. 15 నెలల డిలే తర్వాత డెలివరీ!
X

దిశ, నేషనల్ బ్యూరో: యూఎస్ నుంచి రావలసిన అపాచే హెలీకాప్టర్ల కోసం భారత్ ఎదురు చూపులకు తెరపడినట్లే కనిపిస్తోంది. 2020లో మొత్తం ఆరు అపాచే ఏహెచ్-64ఈ హెలికాప్టర్ల కోసం 600 మిలియన్ డాలర్లకు భారత్, యూఎస్ మధ్య ఒప్పందం జరిగింది. వీటిని రెండు బ్యాచుల్లో పంపుతామని యూఎస్ తెలిపింది. 2024లో మే-జూన్ నాటికి మొత్తం ఆరు హెలికాప్టర్ల డెలివరీ పూర్తిచేయాలని ఒప్పందం కుదిరింది. కానీ కొన్ని కీలక సాంకేతిక సమస్యల కారణంగా తొలి బ్యాచ్ హెలికాప్టర్ల డెలివరీనే పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది.

ఈ హెలికాప్టర్లు వచ్చేస్తాయనే ఆలోచనతో 2024 మార్చిలో జోధ్‌పూర్‌లో ఆర్మీకి చెందిన ఏవియేషన్ కార్ప్స్.. అపాచే స్క్వాడ్రన్‌ను కూడా ఏర్పాటు చేశాయి. కానీ హెలికాప్టర్లు మాత్రం రాలేదు. దాదాపు 15 నెలల ఆలస్యం తర్వాత ఈ నెలలోనే తొలి బ్యాచ్ హెలికాప్టర్లు భారత్‌కు వస్తున్నట్లు సమాచారం. ఇవి రాగానే జోధ్‌పూర్ పంపించి, పాక్‌తో సరిహద్దు వద్ద డిప్లాయ్ చేసేందుకు ఆర్మీ సిద్ధంగా ఉందట. ఈ నెలాఖరులోగా తొలి బ్యాచ్‌లో మూడు హెలికాప్టర్లు పంపుతామని, మిగతా మూడింటిని ఈ ఏడాది చివరికల్లా పంపించేస్తామని యూఎస్ వర్గాలు భారత్‌కు హామీ ఇచ్చినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

Next Story