- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
16వేల మంది విదేశీయులను బహిష్కరించనున్న భారత ప్రభుత్వం.. కారణం ఇదేనా?
భారత్ నుంచి 16 వేల మంది విదేశీయులను బహిష్కరించేందుకు భారత ప్రభుత్వం చర్యలు చేపట్టనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

దిశ, వెబ్‌డెస్క్: భారత్ నుంచి 16 వేల మంది విదేశీయులను బహిష్కరించేందుకు భారత ప్రభుత్వం చర్యలు చేపట్టనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. వారంతా దేశంలో మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు పాల్పడుతున్నారన్న ఆరోపణల నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు హోం వ్యవహారాల మంత్రిత్వశాఖ బహిష్కరించాలని నిర్ణయించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. బంగ్లాదేశ్, మయన్మార్, ఫిలిప్పీన్స్, మలేషియా, ఘనా, నైజీరియా వంటి దేశాలకు చెందిన పౌరులను బహిష్కరించనున్నట్లు తెలుస్తోంది.
ఈ విదేశీ పౌరులు మాదకద్రవ్యాల అక్రమ రవాణాతో పాటు పలు నేరాలకు పాల్పడినట్లు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB)సమర్పించిన నివేదిక ఆధారంగా కేంద్రం ఈ చర్యలు తీసుకుంటోంది. ప్రస్తుతం వీరు అనేక రాష్ట్రాల్లో నిర్బంధ కేంద్రాల్లో ఉన్నారు. కొత్త వలస చట్టంలోని నిబంధనల (New Immigration Law) ప్రకారం వారి బహిష్కరణ జరుగుతుందని అధికారిక వర్గాలు తెలిపాయి.






