- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Bharat Antariksha Station: భారత అంతరిక్ష కేంద్రం 2035కల్లా రెడీ.. 2040కల్లా చంద్రుడిపైకి భారతీయుడు
దిశ, నేషనల్ బ్యూరో : భారత అంతరిక్ష కేంద్రం(Bharat Antariksha Station) 2035కల్లా సిద్ధమవుతుందని కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ, అంతరిక్ష శాఖ సహాయ మంత్రి జితేంద్రసింగ్ వెల్లడించారు.

దిశ, నేషనల్ బ్యూరో : భారత అంతరిక్ష కేంద్రం(Bharat Antariksha Station) 2035కల్లా సిద్ధమవుతుందని కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ, అంతరిక్ష శాఖ సహాయ మంత్రి జితేంద్రసింగ్ వెల్లడించారు. 2040 నాటికి చంద్రుడిపై(Moon Landing) భారతీయుడు కాలుమోపుతాడని ఆయన తెలిపారు. 2025 సంవత్సరం చివరికల్లా లేదా 2026 సంవత్సరం ప్రారంభం నాటికి గగన్‌యాన్ మిషన్ కింద అంతరిక్షంలోకి తొలి భారతీయ(India) వ్యోమగామిని పంపుతామని చెప్పారు. ఇదే భారతదేశపు మొట్టమొదటి మానవ సహిత అంతరిక్ష యాత్ర. విలేకరుల సమావేశంలో కేంద్ర మంత్రి జితేంద్రసింగ్ మాట్లాడుతూ.. సైన్స్ అండ్ టెక్నాలజీ, అంతరిక్ష శాఖలు 2024 సంవత్సరంలో నిర్వహించిన వివిధ ప్రతిష్ఠాత్మక కార్యక్రమాల గురించి వివరించారు.
సొంత అంతరిక్ష కేంద్రాలను కలిగిన అమెరికా వంటి అగ్రరాజ్యాల సరసన త్వరలో భారత్ నిలుస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఇస్రో చరిత్రలో ఇప్పటివరకు మొత్తం 432 విదేశీ ఉపగ్రహాలను ప్రయోగించగా.. గత పదేళ్ల మోడీ హయాంలో ఏకంగా 397 విదేశీ శాటిలైట్లను ప్రయోగించామని జితేంద్రసింగ్ తెలిపారు. భారతదేశ తొలి మానవ సహిత డీప్ ఓషన్ మిషన్ ‘సముద్రయాన్’ కోసం మత్స్య-6000 జలాంతర్గామిని చెన్నైలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ (ఎన్‌ఐఓటీ) అభివృద్ధి చేసిందన్నారు. ఈ జలాంతర్గామిలో ముగ్గురు కూర్చొని సముద్ర గర్భంలో గరిష్ఠంగా 6 కిలోమీటర్ల లోతుకు చేరుకొని.. సముద్ర వనరులు, జీవ వైవిధ్యాన్ని అధ్యయనం చేయొచ్చని ఆయన చెప్పారు.






