ఐఫోన్ల ఎగుమతిలో చైనాను దాటేసిన భారత్.. ఏప్రిల్‌లో యూఎస్‌కు 30 లక్షల ఫోన్లు

by Phanindra |

ఐఫోన్ల ఎగుమతిలో చైనాను భారత్ దాటేసింది. ఏప్రిల్‌లో యూఎస్‌కు 30 లక్షల ఫోన్లు పంపినట్లు రిపోర్టులు చెప్తున్నాయి.

ఐఫోన్ల ఎగుమతిలో చైనాను దాటేసిన భారత్.. ఏప్రిల్‌లో యూఎస్‌కు 30 లక్షల ఫోన్లు
X

దిశ, నేషనల్ బ్యూరో: యూఎస్‌కు ఐఫోన్లు ఎగుమతి చేసే విషయంలో చైనాను భారత్ అధిగమించింది. తాజా అంచనాల ప్రకారం, ఏప్రిల్ నెలలో సుమారు 30 లక్షల ఐఫోన్లు భారత్ నుంచి యూఎస్‌కు ఎగుమతి అయినట్లు సమాచారం. ఇదే సమయంలో చైనా నుంచి ఎగుమతైన ఐఫోన్ల సంఖ్య 76 శాతం తగ్గి 9 లక్షలకు చేరింది. ఇటీవలే భారత్‌లో కనుక ఐఫోన్లు తయారుచేసి యూఎస్‌లో అమ్మితే అదనంగా 25 శాతం టారిఫ్‌లు వేస్తానని ట్రంప్ బెదిరించిన సంగతి తెలిసిందే. ఈ సుంకాలు అమలయ్యేలోపే సాధ్యమైనన్ని ఐఫోన్లను భారత్ నుంచి యూఎస్‌కు చేర్చాలని యాపిల్ ప్రయత్నిస్తోందని, అందుకే ఈ స్థాయిలో ఐఫోన్లను యూఎస్‌కు తీసుకెళ్తోందని నిపుణులు భావిస్తున్నారు.

Next Story