India: ఢిల్లీలోని పాక్ దౌత్యవేత్తకు కేంద్రం సమన్లు

by Shamantha N |

జమ్ముకశ్మీర్‌లోని పెహల్గాంలో పర్యటకులపై ఉగ్రదాడిపై (Pahalgam terror attack) భారత్‌ తీవ్రంగా స్పందిస్తుంది. ముష్కరులకు సహకరిస్తున్న పాకిస్థాన్ ను హెచ్చరిస్తూ పలు కీలక చర్యలు తీసుకుంటుంది.

India: ఢిల్లీలోని పాక్ దౌత్యవేత్తకు కేంద్రం సమన్లు
X

దిశ, నేషనల్ బ్యూరో: జమ్ముకశ్మీర్‌లోని పెహల్గాంలో పర్యటకులపై ఉగ్రదాడిపై (Pahalgam terror attack) భారత్‌ తీవ్రంగా స్పందిస్తుంది. ముష్కరులకు సహకరిస్తున్న పాకిస్థాన్ ను హెచ్చరిస్తూ పలు కీలక చర్యలు తీసుకుంటుంది. పాక్ తో దౌత్య సంబంధాలకు సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈక్రమంలోనే ఢిల్లీలోని పాక్‌ (Pakistan) దౌత్యవేత్తకు కేంద్రం సమన్లు జారీ చేసింది. పాకిస్థాన్‌ దౌత్యవేత్త సాద్‌ అహ్మద్‌ వరైచ్‌కు బుధవారం అర్ధరాత్రి తర్వాత ఈ సమన్లు పంపింది. ఆయనను పిలిపించి.. పాక్‌ మిలిటరీ దౌత్యవేత్తలకు ‘పర్సోనా నాన్‌ గ్రాటా (అనవసరమైన వ్యక్తులుగా పేర్కొనే)’ అధికారిక నోటీసు అందించింది. దీని ప్రకారం వారు వారం రోజుల్లోగా భారత్‌ను వీడాల్సి ఉంటుందని విదేశాంగశాఖ వర్గాలు వెల్లడించాయి. భారత్ కూడా ఇస్లామాబాద్‌లోని భారత హైకమిషన్ నుంచి తన రక్షణ/ నౌకా/ వాయుసేన సలహాదారులను వెనక్కి పిలిపిస్తోంది. అంతేకాకుండా, ఆహోదాలను కూడా రద్దు చేస్తున్నట్లు విదేశాంగ శాఖ పేర్కొంది. ఈ సలహాదారులకు సహాయం చేసే ఐదుగురు సిబ్బందిని కూడా రెండు హైకమిషన్ల నుంచి ఉపసంహరించనున్నట్లు వెల్లడించింది. మరోవైపు.. పాకిస్థాన్‌ జాతీయ భద్రతా కమిటీ గురువారం సమావేశం కానుంది. ఆ దేశ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ అధ్యక్షతన ఈ భేటీ జరగనుంది. భారత్‌ తీసుకున్న కీలక నిర్ణయాలను ఈ కమిటీలో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Next Story