- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బంగ్లాదేశ్ దౌత్యవేత్తకు భారత్ సమన్లు
ఇండియాలో తాత్కాలిక హైకమిషనర్‌గా వ్యవహరిస్తున్న నురల్ ఇస్లామ్ సమన్లు అందుకున్న వెంటనే సోమవారం విదేశాంగ శాఖ కార్యాలయానికి చేరుకొని వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది.

- సరిహద్దు ఉద్రిక్తలపై భారత్ ఆందోళన
- వివరణ ఇచ్చిన నురల్ ఇస్లామ్
దిశ, నేషనల్ బ్యూరో:
ఇండో-బంగ్లా బార్డర్ వద్ద నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో బంగ్లాదేశ్ డిప్యూటీ హైకమిషనర్ నురల్ ఇస్లామ్‌కు విదేశాంగ శాఖ సమన్లు జారీ చేసింది. ఇండియాలో తాత్కాలిక హైకమిషనర్‌గా వ్యవహరిస్తున్న నురల్ ఇస్లామ్ సమన్లు అందుకున్న వెంటనే సోమవారం విదేశాంగ శాఖ కార్యాలయానికి చేరుకొని వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది. బంగ్లాదేశ్ నుంచి ఇండియాలోకి చొరబాట్లు, స్మగ్లింగ్ కార్యాకలాపాలు పెరగడంలో బీఎస్ఎఫ్ తాత్కాలిక కంచె నిర్మాణానికి పూనుకుంది. దీంతో ఆదివారం బంగ్లాదేశ్‌లోని భారత హైకమిషనర్ ప్రణయ్ వర్మకు ఆ దేశ విదేశాంగ శాఖ సమన్లు జారీ చేసింది. ఇరు దేశాల సరిహద్దు వద్ద పెరుగుతున్న ఉద్రిక్త వాతావరణం పట్ల బంగ్లా ఆందోళన వ్యక్తం చేసింది. దీంతో భారత్ కూడా బంగ్లాదేశ్ దౌత్యవేత్తను పిలిచి తగు వివరణ అడిగింది. బంగ్లా విదేశాంగ శాఖ కార్యదర్శి జషీముద్దీన్‌తో సమావేశం అనంతరం ప్రణయ్ వర్మ మీడియాతో మాట్లాడారు. కంచెల విషయంలో ఇరు దేశాల సరిహద్దు రక్షణ దళాలు ఒక అవగాహనతో ఉన్నాయయి. బార్డర్ వెంట నేరాల నియంత్రణకు సహకారం కొనసాగుతుందని తెలిపారు. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ఆ దేశాన్ని వదిలి ఇండియకు పారిపోయి వచ్చి, ఒక అజ్ఞాత ప్రదేశంలో తలదాచుకుంటున్నారు. అప్పటి నుంచి ఇరు దేశాల మధ్య ఉద్రిక్తలు పెరిగాయి.






