- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కే 4 బాలిస్టిక్ క్షిపణి పరీక్ష సక్సెస్.. ఐఎన్ఎస్ అరిఘాత్ నుంచి ప్రయోగం
కే 4 బాలిస్టిక్ క్షిపణి పరీక్ష సక్సెస్ అయింది. ఐఎన్ఎస్ అరిఘాత్ నుంచి దీన్ని ప్రయోగించారు.

దిశ, నేషనల్ బ్యూరో: భారత్ విజయవంతంగా న్యూక్లియర్ సామర్థ్యం కలిగిన కే 4 బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది. సుమారు 3,500 కిలోమీటర్ల సామర్థ్యం ఉన్న ఈ సబ్‌మెరీన్ లాంచ్డ్ బాలిస్టిక్ మిసైల్స్ (ఎస్‌ఎల్‌బీఎం)ను బంగాళాఖాతంలో ఐఎన్ఎస్ అరిఘాత్ నుంచి ప్రయోతించారు. విశాఖపట్టణం తీరంలో చేసిన ఈ టెస్ట్ ఫైర్ విజయవంతమైనట్లు అధికారులు ప్రకటించారు. అయితే ఈ పరీక్ష గురించి రక్షణ రంగం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. గతేడాది కూడా ఐఎన్ఎస్ అరిఘాత్ నుంచే కే4 మిసైల్స్‌ను ప్రయోగించారు. ఇప్పుడు మరోసారి ప్రయోగం సక్సెస్ కావడంతో.. త్వరలోనే ఈ మిసైల్స్ ఆపరేషనల్ రెడీ అవుతాయని నిపుణులు భావిస్తున్నారు. డీఆర్‌డీవో అభివృద్ధి చేసిన ఈ న్యూక్లియర్ సామర్థ్యమున్న మిసైల్.. భారత జలాంతర్గాములను మరింత శక్తిమంతంగా మార్చడంతో దేశ వ్యూహాత్మక సామర్థ్యాలను రెట్టింపు చేస్తుందని నిపుణులు అంటున్నారు.






