ఛోక్సీని ఉంచే జైలు ఇదే.. వైరల్ అవుతున్న బారాక్ నెం.12 ఫొటోలు!

by Phanindra |

ఆర్థర్ రోడ్ జైల్లో ఛోక్సీని ఉంచే జైలు గది ఫొటోలు వైరల్ అవుతున్నాయి. బారాక్ నెం.12 ఫొటోలను బెల్జియం కోర్టుకు భారత్ సమర్పించింది.

ఛోక్సీని ఉంచే జైలు ఇదే.. వైరల్ అవుతున్న బారాక్ నెం.12 ఫొటోలు!
X

దిశ, నేషనల్ బ్యూరో: ఆర్థిక నేరగాడు మెహుల్ ఛోక్సీని భారత్‌కు తెచ్చే విషయంలో కీలక ముందడుగు పడింది. భారత్‌లో తనకు సరైన వసతులు ఉండవన్న ఛోక్సీ వాదనలకు భారత్ సమాధానమిచ్చింది. అతన్ని ఆర్థర్ రోడ్ జైలులోని బారాక్ నెంబర్ 12లో ఉంచుతామని తెలిపింది. ఆ జైలుకు సంబంధించిన ఫొటోలను బెల్జియం కోర్టుకు సమర్పించింది. ఈ బారాక్‌లో రెండు గదులు, అటాచ్డ్ బాత్రూం, 24 గంటలూ పోలీసుల కాపలా ఉంటుందని వివరించింది. ఛోక్సీ ఈ జైలులోనే ఉంటారని, మెడికల్ విజిట్స్ లేదా కోర్టు హియరింగ్స్‌కు మాత్రమే బయటకు వస్తారని వెల్లడించింది.

అలాగే ఛోక్సీ జ్యుడీషియల్ కస్టడీలో ఉంటారని, దర్యాప్తు సంస్థ కస్టడీలో కాదని కూడా తెలిపింది. ఛోక్సీ హక్కులు, ఆరోగ్యాన్ని కాపాడతామని చెప్పిన భారత్.. ఆర్థర్ రోడ్ జైలు అంతర్జాతీయ ప్రమాణాలు కలిగి ఉందని పేర్కొంది. భారత్‌లో జైళ్లు చాలా దారుణంగా ఉంటాయని, జ్యుడీషియరీకి స్వేచ్ఛ ఉండదని ఛోక్సీ తరఫు న్యాయవాది వాదించారు. అయితే కోర్టు ఈ వాదనలను కొట్టేసింది. ఈ బారాక్ నెంబర్ 12కు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Next Story