- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పుట్టెడు కష్టాల్లో అఫ్గానిస్థాన్.. అండగా నిలిచిన భారత్
భారీ భూకంపం అఫ్గానిస్థాన్(Afghanistan)ను అతలాకుతలం చేసింది.

దిశ, వెబ్‌డెస్క్: భారీ భూకంపం అఫ్గానిస్థాన్(Afghanistan)ను అతలాకుతలం చేసింది. ఈ భూకంపం కారణంగా దాదాపు 20 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా.. 150 పైచిలుకు మందికి పైగా గాయపడ్డారని అధికారులు పేర్కొన్నారు. అనేకమంది శిథిలాల్లో చిక్కుకున్నారన్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు వెల్లడించారు. భూకంపం కారణంగా పలు గ్రామాల్లోని ఇళ్లు పూర్తిగా నేలమట్టమయ్యాయని ఆ దేశ జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ అధికారులు వెల్లడించారు. ఈ విపత్తు ధాటికి పలు కుటుంబాలు కకావికలమైనట్లు పేర్కొన్నారు. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించడానికి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయితే.. ఈ కష్ట సమయంలో అఫ్గానిస్థాన్‌కు భారత్ అండగా నిలిచింది. భూకంపంతో అల్లాడుతున్న అఫ్గాన్‌కు సాయం చేసింది. బాధితులను ఆదుకునేందుకు పెద్ద ఎత్తున ఆహార పదార్థాలను అక్కడికి పంపింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్ ధీర్ జైస్వాల్ షేర్ చేశారు. మరోవైపు రిలీఫ్ మెటీరియల్ అందజేశామని, మెడిసిన్ సరఫరా కూడా త్వరలోనే జరుగుతుందని విదేశాంగ మంత్రి జైశంకర్ ట్వీట్ చేశారు. ట్వీట్






