అమెరికాతో భారత్ జావెలిన్ యాంటీ–ట్యాంక్ క్షిపణుల కొనుగోలుకు డీల్

by Malleboina Mahesh |

గత కొద్ది నెలలుగా భారత్, ఆమెరికా మధ్య టారిఫ్‌ల వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెరికాతో భారత్ జావెలిన్ యాంటీ–ట్యాంక్ క్షిపణుల కొనుగోలు డీల్ చేసుకుంది.

అమెరికాతో భారత్ జావెలిన్ యాంటీ–ట్యాంక్ క్షిపణుల కొనుగోలుకు డీల్
X

దిశ, వెబ్ డెస్క్: గత కొద్ది నెలలుగా భారత్, ఆమెరికా మధ్య టారిఫ్‌ల వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెరికాతో భారత్ జావెలిన్ యాంటీ–ట్యాంక్ క్షిపణుల కొనుగోలు డీల్ చేసుకుంది. ఇది మరోసారి భారత్‌ రక్షణ భాగస్వామ్యాన్ని బలపరిచే నిర్ణయం తీసుకుంది. జావెలిన్ యాంటీ–ట్యాంక్ క్షిపణులు సహా పలు అత్యాధునిక ఆయుధాల విక్రయానికి అమెరికా అధికారికంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొత్తం 93 మిలియన్ డాలర్ల విలువైన ఈ ఒప్పందాన్ని డిఫెన్స్ సెక్యూరిటీ కోఆపరేషన్ ఏజెన్సీ (DSCA) ప్రకటించింది. జావెలిన్ వంటి స్మార్ట్ క్షిపణులు శత్రు ట్యాంకులను, కవచ వాహనాలను కొన్ని సెకన్లలో నేలమట్టం చేసే సామర్థ్యం కలిగి ఉండటంతో, ఈ డీల్ భారత్‌ రక్షణ శక్తిని మరింత పదునుపెట్టనుందని నిపుణులు చెబుతున్నారు.

ఆయుధాలతో పాటు శిక్షణ, నిర్వహణ, సాంకేతిక సహాయం వంటి కీలక మద్దతును కూడా అమెరికా ఇవ్వనుంది. ఈ ఒప్పందంతో ఇండో–పసిఫిక్ ప్రాంతంలో భారత్‌ ప్రాధాన్యం మరింత పెరిగినట్లే. చైనా నుంచి పెరుగుతున్న వ్యూహాత్మక సవాళ్ల నేపథ్యంలో, భారత్‌కు అత్యాధునిక క్షిపణి వ్యవస్థలు అందించడమే కాకుండా, అమెరికా–భారత్ రక్షణ బంధాన్ని అప్‌గ్రేడ్ చేసిన నిర్ణయంగా విశ్లేషకులు చూస్తున్నారు. ఇటీవలే రెండు దేశాలు పలు రక్షణ రంగ ఒప్పందాలను ముగించగా, తాజా డీల్ ఆ సహకారానికి మరో బలమైన ముద్రగా నిలిచింది. ముందు నెలలో ఈ ఆయుధాలు భారత దళాలకు అందే అవకాశముంది.

Next Story