T-72 tank: రష్యాతో భారత్ భారీ ఒప్పందం.. ఎందుకంటే?

by Shamantha N |

రష్యాతో భారత్ మిలియన్ డాలర్ల భారీ ఒప్పందాన్ని చేసుకుంది. T-72 ట్యాంకులను అప్‌గ్రేడ్ చేయడానికి 248 మిలియన్ డాలర్లతో ఒప్పందం కుదుర్చుకుంది.

T-72 tank: రష్యాతో భారత్ భారీ ఒప్పందం.. ఎందుకంటే?
X

దిశ, నేషనల్ బ్యూరో: రష్యాతో భారత్ మిలియన్ డాలర్ల భారీ ఒప్పందాన్ని చేసుకుంది. T-72 ట్యాంకులను అప్‌గ్రేడ్ చేయడానికి 248 మిలియన్ డాలర్లతో ఒప్పందం కుదుర్చుకుంది. T-72 యుద్ధ ట్యాంకుల కోసం 1,000-హార్స్‌పవర్ (HP) ఇంజిన్‌లను కొనుగోలు చేయడానికి రక్షణ మంత్రిత్వ శాఖ, రష్యన్ రక్షణ సంస్థ రోసోబోరోనెక్స్‌పోర్ట్‌ మధ్య శుక్రవారం సంతకాలు జరిగాయి. అసెంబుల్, నాక్- డౌన్, సెమీ నౌక్ డౌన్ పరిస్థితుల్లోని ఇంజిన్ల కొనుగోలుకు ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగంగా రష్యన్ రక్షణ సంస్థ నుంచి చెన్నైకి చెందిన ఆర్మర్డ్ వెహికిల్స్ నిగమ్ లిమిటెడ్ మధ్య టెక్నాలజీ బదిలీ ఉంటుంది. రక్షణ రంగంలో ‘‘మెక్ ఇన్ ఇండియా’’ చొరవ పెంచడానికి ఇది ఉపయోగపడనుంది.

100 హెచ్ పీ ఇంజిన్లు

భారత సైన్యంలోని ట్యాంక్ ఫ్లీట్‌లో T-72 చాలా ముఖ్యమైంది. ప్రస్తుతం దీనికి 780 హెచ్‌పీ ఇంజన్లు అమర్చారు. ఆ ఇంజిన్ స్థానంలో 1000 హెచ్ పీ మార్చడం వల్ల ట్యాంక్ వేగం, దాడి సామర్థ్యం మరింత పెరగనుంది. ప్రాంతీయ సవాళ్లు పెరుగుతున్న నేపథ్యంలో.. T-72 ట్యాంకుల ఇంజన్లను అప్ గ్రేడ్ చేయడం అనివార్యంగా మారింది. జాతీయ భద్రతా ప్రయోజనాలను కాపాడటానికి సాంకేతికంగా ఇది ఉపయోగపడనుంది. అంతేకాకుండా, ఈ చర్య భవిష్యత్ యుద్ధాలకు సైన్యం నిర్వహణలో దేశ నిబద్ధతను నొక్కి చెప్తుంది.

Next Story